విజయ్ దళపతికి రజినీకాంత్ ఫోన్.. ఫ్యాన్ వార్ కు పుల్ స్టాప్ పెట్టిన సూపర్ స్టార్

By Mahesh Jujjuri  |  First Published Feb 8, 2024, 6:21 PM IST

సాధారణంగా తమిళనాట  అజిత్‌-విజయ్‌ అభిమానుల మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండేవి. గొడవలు జరుగుతుండేవి. కాని అజిత్ తన అభిమాను సంఘాలు రద్దు చేయడంతో.. అవి ఆగిపోయాయి. ఇక తాజాగా రజినీకాంత్ , విజయ్ ఫ్యాన్స్ మధ్య కొన్ని గోడవలు వస్తుండటంతో.. వాటికి పుల్ స్టాప్ పెట్టారు తలైవా..? 


 గత ఏడాది కాలంగా అజిత్ అభిమాన సంఘాలు ఆపేశారు.. ఫ్యాన్స్ ఎవరూ సంఘాలు పెట్టవద్దు అన్నారు.దాంతో విజయ్ ఫ్యాన్స్ తో తల అజిత్ కు తలనొప్పి లేకుండా పోయింది. కాని ఈమధ్య రజనీకాంత్ ఓ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో.. విజయ్ అభిమానులు అపార్దం చేసుకుని రచ్చ చేశారు. అయితే రీసెంట్ గా లాల్ సలామ్ ఈవెంట్ లో రజినీకాంత్ ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. మా మధ్య విభేదాలు లేవు.. విజయ్ నా కళ్ల ముందే పెరిగాడు.. ఎదిగాడు..అతనితో నాకు పోటీ ఇలా ఉంటుంది. అంటూ తలైవా క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరిని ఉద్దేశించ ఆమాటలు అనలేదంటూ.. వెల్లడించారు. 

ఇక తాజాగా విజయ్ కు కు తలైవా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.  జ్జానవేల్ డౌరెక్షన్ లో సినిమా చేస్తున్న రజినీకాంత్ .. షూటింగ్ కోసం  ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఇక ఇక్కడి నుంచి ఆయన  విజయ్ కు ఫోన్ చేసినట్టు సమాచారం. రీసెంట్ గా విజయ్  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.  తమిళ వెట్రి కజగం పేరుతో పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.దాంతో రీసెంట్ గా రజినీకాంత్ విజయ్ కు ఫోన్ చేసి చాలా సింపుల్ గా కంగ్రాట్స్ చెప్పాడట. రజనీకాంత్ ఫోన్ చేసి మరీ  శుభాకాంక్షలు చెప్పడంతో..  తలపతి విజయ్ తలైవాకు కృతజ్ఞతలు చెప్పినట్టు సమాచారం. 

Latest Videos

త్రిష ఆస్తి అన్ని కోట్లా...? 40 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్ 20 ఏళ్ళ సినిమా కెరీర్ లో భారీ సంపాదన ..?

దాంతో తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కు తలైవా ఫ్యాన్స్ కు మధ్య వార్ కు పుల్ స్టార్ పడినట్టు అయ్యింది. పాలిటిక్స్ లోకి రావాలని అనుకున్ని అనారోగ్యం దృష్ణ వెనకడుగు వేశారు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. ఇక విజయ్ ఈమధ్యే పార్టీని ప్రకటించారు. 'తమిళక వెట్రి కజగం'గా ప్రకటించి ఎన్నికల కమిషన్‌లో ఈ పేరును నమోదు చేసుకున్నారు. పార్టీ జెండా, గుర్తుతో సహా ఇతర సమాచారం త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

click me!