అయ్యప్ప మాలలో.. శబరిమల యాత్రకు తమిళ హీరోలు. వైరల్ అవుతున్న ఫోటోలు

Published : Jan 15, 2023, 04:57 PM IST
అయ్యప్ప మాలలో.. శబరిమల యాత్రకు తమిళ హీరోలు. వైరల్ అవుతున్న ఫోటోలు

సారాంశం

తమిళ స్టార్స్ కొంత మంది శబరిమల యాత్రకు బయలుదేరారు. అయ్యప్ప మాలలో ఉన్న వారు.. ఇరుముడి కోసం అయ్యప్ప క్షేత్రానికి వెళ్ళారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే..?   

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు అయ్యప్ప మాల వేసుకుంటుంటారు. కొంత మంది ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా మాల ధారణ చేసిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, మోహన్ బాబు.. ఇలా చాలామంది ఇంస్ట్రీ ప్రముఖులు మాలధారణ చేయగాచూశాం. వీరితో పాటు ఇతర భాషల హీరోలు కూడా చాలామంది అయ్యప్ప మాలలు కనిపించనవారు లేకపోలేదు.  బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్, వివేక్ ఒబెరాయ్ లాంటి హీరోలు కొంతమంది అయ్యప్ప మాల  వేస్తారు.ఈక్రమంలోనే.. ప్రముఖులు అయ్యప్ప మల వేసుకొని శబరిమల వెళ్లి వస్తూ ఉంటారు. 

మన టాలీవుడ్ లోనే కాక బయట సినీ పరిశ్రమలో కూడా పలువురు ప్రముఖులు అయ్యప్పమాల వేసుకుంటారు.ఇక ఆంధ్రాతో పాటు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా  అయ్యప్ప భక్తులు ఎక్కువగానే ఉన్నారు. ఈ విషయంలో రీసెంట్ గా క్లారిటీ కూడా వచ్చింది.  పలువురు తమిళ స్టార్స్ కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు.  తాజాగా సీనియర్ నటుడు జయరాం, తమిళ హీరో జయం రవి, దర్శకుడు, నయనతార భర్త విగ్నేష్ శివన్ అయ్యప్పమాల ధరించి ఇరుముడులతో శబరిమలకు బయలుదేరారు.

 

వీరు ఇరుముడులు నెత్తిమీద పెట్టుకొని  యాత్రకు బయలుదేరిన ఫోటోలు ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే  వీరితో పాటుగా  మరికొంతమంది ఇతర  స్వాములు కూడా కనిపించారు. ఆ విషయం అంతట చక్కర్లు కొడుతుంది. అంత పెద్ద స్టార్లు అయ్యుండి కూడా సింపుల్ గా సాధారణ భక్తుల్లా కనిపించే సరికి అంతా ఆశ్చర్చ పోతున్నారు. స్టార్స్ ఎవరైనా మాల వేసుకుని శబరిమల వేళ్తే.. వాళ్లు వెళ్ళి వచ్చిన సంగతి కూడా తెలియకుండా సీక్రేట్ గా వెళ్తుంటారు. వీరు మాత్రం సాధారణ భక్తుల్లా యాత్రకు బయలుదేరడం హాట్ టాపిక్ గా మారింది. 


 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?