Thalapathy 68లో విజయ్ డ్యూయెల్ రోల్.? ఈవారంలోనే లండన్ కు పయనం.. ఇంట్రెస్టింట్ డిటేయిల్స్

Published : Aug 22, 2023, 03:10 PM ISTUpdated : Aug 22, 2023, 03:11 PM IST
Thalapathy 68లో విజయ్ డ్యూయెల్ రోల్.? ఈవారంలోనే లండన్ కు పయనం.. ఇంట్రెస్టింట్ డిటేయిల్స్

సారాంశం

స్టార్ హీరో విజయ్ దళపతి 68వ చిత్రంపై కీలకమైన అప్డేట్ అందింది. త్వరలో ‘లియో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమిళ స్టార్ తదుపరి చిత్రంపైనా ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ గా మూవీ గురించి అందించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.   

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) కి తెలుగులోనూ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ‘స్నేహితులు’, ‘జిల్లా’, ‘కత్తి’, ‘అదిరింది’, ’బిజిల్’, ‘మాస్టర్’ వంటి తమిళ డబ్డ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లోనూ డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ‘వారసుడు’తో వచ్చి  మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక విజయ్ తదుపరి చిత్రం ‘లియో’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రం అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. 

ఇక నెక్ట్స్ విజయ్ Thalapathy 68లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ 68వ చిత్రంపై తాజాగా కీలకమైన అప్డేట్ అందింది. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ లుక్ టెస్ట్ కోసం ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. లండన్‌లో లుక్ టెస్ట్‌ జరగనుందని లేటెస్ట్ అప్డేట్. ఈ వారమే యూనిట్ బయల్దేరనుందట. ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకోబోతోంది. 

Thalapathy 68వ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ గా కనిపించబోతుడటం ఫ్యాన్స్ కు ట్రీట్ అనే చెప్పాలి. ఇక ‘లియో’లోనూ విజయ్ డ్యూయెల్ రోల్ లో అలరించబోతున్నారని ఇప్పటి వరకు ఉన్న టాక్. ఇదిలా ఉంటే విజయ్ - వెంకట్ ప్రభు చిత్రంలో హీరోయిన్లుగా యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్, జ్యోతిక పేర్లు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అందనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:దీపను కన్న కూతురివి కాదన్న సుమిత్ర-దీప ఏడుపు- మెడికల్ టెస్టులకు జ్యో
MSG: అనిల్‌ రావిపూడి చేసిన పనికి చుట్టాల్లో ఇబ్బంది పడ్డ వెంకటేష్‌ భార్య, చిరంజీవి వద్ద వెంకీ ఆవేదన