అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ మెగాస్టార్ కు సెలబ్రిటీల బర్త్ డే శుభాకాంక్షలు..

Published : Aug 22, 2023, 01:09 PM IST
అల్లు అర్జున్, ఎన్టీఆర్,  పవన్  మెగాస్టార్ కు సెలబ్రిటీల బర్త్ డే  శుభాకాంక్షలు..

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అభిమానులతో పాటు.. ఇండస్ట్రీలోని సెలబ్రిటీ.. మెగా ఫ్యామిలీ హీరోలు కూడా చిరు బర్త్ డెను సెలబ్రేట్ చేస్తూ.. ఆయన్ను విష్ చేస్తున్నారు.   

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అభిమానులతో పాటు.. ఇండస్ట్రీలోని సెలబ్రిటీ.. మెగా ఫ్యామిలీ హీరోలు కూడా చిరు బర్త్ డెను సెలబ్రేట్ చేస్తూ.. ఆయన్ను విష్ చేస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. మెగా అభిమానుల దగ్గర నుంచి.. స్టార్ సెలబ్రిటీల వరకూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ పోటీ పడ్డారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ ను డిఫరెంట్ స్టైల్లో విష్ చేశారు.. చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ చిరంజీవికి విషెష్ తెలిపింది ఎవరంటే..? 

మెగాస్టార్ కు అందరకింటే ముందే  శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి అని పవన్ కోరకున్నారు. ఇక ఈరోజు మెగాస్టార్ కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడ్డాయి. 

ముఖ్యంగా అంతా ఎదురు చూసేది అల్లు అర్జున్ విషెష్ కోసం. ఆయన ఎప్పటిలాగానే విష్ చేస్తారా అని చిన్న క్యూరియాసిటీ ఉంది ఫ్యాన్స్ లో. ఎందుకంటే...మెగా ఫ్యాలీ.. అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అంటూ.. వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మెగా బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ విష్ చేశారు.. వన్ అండ్ ఓన్లీ.. మెగాస్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ విష్ చేశారు బన్నీ. 

 

అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మెగాస్టార్ ను విష్ చేశారు. మంచి ఆరోగ్యకరమైన జీవితం మీకు కలగాలి అంటూ.. హ్యాపీబర్త్ డే మెగాస్టార్ చిరంజీవిగారు అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. 

 

మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి కూడా వరుసగా విషెష్ అందుతున్నాయి మెగాస్టార్ కు.  వరుణ్ తేజ్ ట్వీట్ చేస్తూ... మా చిరు నవ్వు. మా అందరి ఆనందం.. మా ఫ్యామిలీకి కొండంత ధైర్యం అని అంటూ.. హ్యాపీబర్త్ డే మెగాస్టార్ చిరంజీవి అంటూ ట్వీట్ చేశారు వరుణ్ తేజ్. 

 

మా అందరికి ఆదర్శం. మంచి మనసు ఉన్న మా పెద్ద మామ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు మెగాస్టార్ కు సాయి ధరమ్ తేజ్ ముద్దు పెడుతున్న ఫోటోను కూడా శేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్. 

 

బాస్ ఆఫ్ మాస్.. వన్ అండ్ ఒన్లీ మెగాస్టార్ కు హ్యాపీ బర్త్ డే అంటూ.. విష్ చేశారు టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ సంస్థలు గీతాఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్.. అంతే కాదు యూవీ క్రియేషన్స్, విశ్వ ప్రసాద్ కూడా మెగాస్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు., 

 

ఇక యంగ్ హీరోలు చాలా మంది మెగాస్టార్ కు బర్త్ డే విష్ చెపుతున్నారు. అందులో యువ హీరో కార్తికేయ మెగాస్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 17 అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు భారీ ప్లాన్ వేసి శ్రీవల్లి, భాగ్యం.. కానీ
Thanuja: సీరియల్స్ కి తనూజ గుడ్‌ బై.. ఇకపై ఆమె టార్గెట్‌ ఇదే.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 కి వెళ్లిన కారణం ఇదేనా