అకీరా నందన్‌ ఫొటో ట్వీట్ డిలీట్ , రేణూ దేశాయ్‌ షాకింగ్ స్పందన

Published : Aug 22, 2023, 12:54 PM IST
  అకీరా నందన్‌ ఫొటో ట్వీట్ డిలీట్ ,  రేణూ దేశాయ్‌ షాకింగ్ స్పందన

సారాంశం

. వాళ్లిద్దరితో కలిసి ఉన్న ఫోటోను రాఘవేంద్రరావు షేర్ చేశారు. అయితే కొంతసేపటికే ఆ ఫోటోను డిలీట్ చేసేశాడు. అప్పటికే కొందరు ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి తమ తమ ఖాతాల్లో పోస్టు చేయడంతో అదికాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది. 


ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో (Raghavendra Rao) పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.  ఇది చూసిన పవన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో ఆయన మనవడు కార్తికేయ, అకీరాతో దిగిన ఫొటో షేర్ చేసిన దర్శకేంద్రుడు.. ‘‘నాలుగో తరం అబ్బాయిలతో రాఘవేంద్రరావు. నా మనవడు కార్తికేయ, పవన్‌ కుమారుడు అకీరా నందన్‌.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్‌ స్కూల్లో చేరారు’’ అని రాశారు. అయితే ఈ ట్వీట్‌ను ఆయన కొద్ది సేపటికే తొలగించారు.  కానీ అప్పటికే ఈ ఫొటో వైరలైంది.దాంతో అసలు ఎందుకు రాఘవేంద్రరావు గారు షేర్ చేసింది డిలీట్ చేసారు అనేది హాట్  టాపిక్ గా మారింది.

అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఈ ఫొటో షేర్ చేయటంతో అందరూ హీరోగా అకీరా లాంచింగ్ గురించి మాట్లాడటం మొదలెట్టారు. అదీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలోనా అంటూ కొన్ని స్టోరీ లు మొదలవుతున్నాయి. ఈ ట్రెండ్ చూసిన రాఘవేంద్రరావు ..వెంటనే తొలించారు. అయితే అప్పటికే ఆ ఫొటోను సేవ్ చేసుకుని పవన్  అభిమానులంతా మరికొద్దిరోజుల్లో అకీరాను బిగ్‌ స్క్రీన్‌పై చూడనున్నామని సంబరపడుతూ.. ఫొటోను షేర్‌ చేస్తున్నారు. 
 
ఇక ఈ విషయమై  రేణూ దేశాయ్‌ (Renu Desai) తన ఇన్‌స్టాలో స్పందించారు. ‘‘ప్రస్తుతానికి అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అనుకోవడం లేదు. భవిష్యత్తులో తన నిర్ణయం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఏదైనా పోస్ట్‌ చేసిన వెంటనే దానికి సంబంధించిన గెస్సింగ్ లు ఆపేయండి. ఒకవేళ అకీరా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని నేను మీతో కచ్చితంగా షేర్ చేసుకుంటాను’’ అని అన్నారు. అలాగే రాఘవేంద్రరావుతో తాను దిగిన ఫొటోను కూడా రేణూ దేశాయ్ పంచుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌