తమిళ స్టార్ సూర్య (Suriya) తన అభిమాని మృతి పట్ల చింతించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.
తమిళ స్టార్ సూర్యకు సౌత్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా అమెరికాలోని టెక్సాస్ లో గల ఓ మాల్ లో కాల్పులు జరిగాయి. ఓ దుంగడు జరిపిన గన్ ఫైర్ లో హైదరాబాద్ కు చెందిన యువతి తాటికొండ ఐశ్వర్య (Aishwarya Tatikonda) మరణించిన విషయం తెలిసిందే. వారం కిందనే ఆమె మృతదేహం హైదరాబాద్ కు కూడా చేరుకుంది.
అయితే, ఐశ్వర్య తమిళ స్టార్ సూర్యకు వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న సూర్య తాజాగా యువతి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమె చిత్ర పటానికి నివాళి అర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా సుధీర్ఘమైన ఎమోషనల్ నోట్ ను కూడా విడుదల చేశారు. ‘తాటికొండ ఐశ్వర్య టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో చనిపోవడం దురదృష్ణకరం. ఆమె తల్లిదండ్రలు టీ అరుణ, టీ నర్సి రెడ్డికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో మాటలు కూడా రావడం లేదు.
ఐశ్వర్య ఆకాశంలో వెలిగే నక్షత్రంలా ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుందని నమ్ముతున్నాను. అలాంటి పరిస్థితులను ఐశ్వర్య దైర్యంగా ఎదుర్కోవడంలో హీరోగా భావిస్తున్నాను. ఇది నేను మీకిచ్చే నివాళి కాదు. నీ నవ్వు, నీ ప్రేమ ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది. నీ స్నేహితులు, కుటుంబానికి నువ్వో ధృవతారవు’ భావోద్వేగమయ్యారు.
మే 6న టెక్సాస్ లో జరిగిన ఓ మాల్ లో దుండగులు కాల్పులు జరిపించారు. ఈ ఘటనలో ఐశ్వర్యతో పాటు మరో ఏడుగురు కూడా మరణించారు. ఐశ్వర్య హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందినది. కాల్పుల్లో ఆమె స్నేహితుడు కూడా గాయపడ్డాడు. ఇక ఆమె తండ్రి రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎంఎస్ చేయడానికి యూఎస్ కు వెళ్లింది. కోర్సు పూర్తి చేసి అక్కడే ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తోంది. ఈ సమయంలో ఇలా జరగడం అందరినీ బాధించింది.
’ఆకాశమే నీ హద్దురా‘, ’జై భీమ్‘ వంటి చిత్రాల తర్వాత సూర్య నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ‘కంగువ’. సూర్య42వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. శివ దర్శకత్వం వహిస్తున్నారు. శక్తివంతమైన యోధుడిగా కనిపించబోతున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ రాజా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ నటిస్తోంది. యోగి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం.
A man who respects his fans is a real star.
Heartfelt note from to his fan , who was shot at the Allen Mall shooting in Texas, USA. Such comforting words. pic.twitter.com/pfGJbM1fpl