
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే నేడు. ఆయన 40వ ఏట అడుగుపెట్టారు. గత నెల రోజులుగా ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలను అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. చిత్ర ప్రముఖులు, సన్నిహితులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తుడు. ఇద్దరూ ఒకరినొకరు బావా అని పిలుచుకుంటారు.
ఈ క్రమంలో మిత్రుడు ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలియజేశారు. 'నువ్వు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి బావా.. హోప్ యు హావ్ బ్లడీ గుడ్ బర్త్ డే' అని ట్విట్టర్లో శుభాకాంక్షలు పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్-అల్లు అర్జున్ మ్యూచువల్ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కాగా ఎన్టీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర అప్డేట్ అదిరింది. దర్శకుడు కొరటాల ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఊరమాస్ అవతార్ షాక్ ఇచ్చింది.
దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఫస్ట్ లుక్ చూశాక అనుమానాలు బలపడుతున్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా దేవర విడుదల కానుంది. అనంతరం ప్రశాంత్ నీల్, వార్ 2 చిత్రాలకు ఎన్టీఆర్ కమిటయ్యారు.