నన్ను సీఎం ను చేయండి.. 150 ఏళ్లు బ్రతుకుతారు.. తమిళ ప్రజలకు స్టార్ హీరో శరత్ కుమార్ బంపర్ ఆఫర్

Published : May 31, 2023, 02:13 PM IST
నన్ను సీఎం ను చేయండి.. 150 ఏళ్లు బ్రతుకుతారు.. తమిళ ప్రజలకు స్టార్ హీరో శరత్ కుమార్ బంపర్ ఆఫర్

సారాంశం

తమిళ తంబీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో.. తమిళ రాజకీయ నేత శరత్ కుమార్. నెక్ట్స్ ఎలక్షన్స్ లో తనను సీఎం ను చేస్తే.. అందరూ 150 ఏళ్లు ప్రతికేలా చేస్తానంటున్నాడు. 

సౌత్ లో ముఖ్యంగా తెలుగు,తమిళనాడు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా వాళ్ల ప్రభావం చాలాఎక్కువ. ఈరెండు రాష్ట్రాలను ఎక్కువగా ఏలింది కూడా సినిమా వాళ్లే.. ముఖ్యంగా తమిళనాట ఎన్నో ఏళ్లనుంచి సినిమా వారి పాలనే సాగింది. అన్నాదురై, కరుణానిధి, ఎమ్జీఆర్, జయలలిత లాంటి సీఎంలతో పాటు.. ఎంతో మంది తమిళనాట సినిమా వాళ్లు రాజకీయంగా ఎదిగారు. అంతే కాదు అధికారం రాకపోయినా.. రాజకీయ పార్టీలు పెట్టి సేవ చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఆమధ్య కమల్ హాసన్ మక్కల్ మీది మయ్యం అనేపార్టీనొ స్థాపించారు. 

అంతకు ముందు కూడా స్టార్ హీరో.. విజయ్ కాంత్ కూడా ఓ పార్టీని స్థాపించారు ఇప్పటికీ ఆ పార్టీ రన్నింగ్ లోనే ఉంది. ఆయనతో పాటు.. మరో హీరో శరత్ కుమార్ కూడా తమిళనాట ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. అదిప్రస్తుతం ఉనికిలోనే ఉంది. ఈ పార్టీ ప్రతీ ఎలక్షన్స్ లో పాల్గొంటూనే ఉంది. నటుడిగా కెకరీర్ స్టార్ట్ చేసిన  శరత్ కుమార్... తొలుత నెగిటివ్ పాత్రలతో పరిచయమై.. తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రలో, ఆ తర్వాత హీరోగా మారారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తున్నారు. 

రాజకీయంగా యాక్టీవ్ గా ఉండే శరత్ కుమార్.. డిఎంకెలో.. ఆతరువాత అన్నాడిఎంకెలో పనిచేసిన ఆయన.. . 2007లో సొంత పార్టీని ఏర్పాటు చేశారు. దీని పేరు ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి. రీసెంట్ గా ఈ పార్టీ మహాసభలు ఘనంగా జరిగాయి. మధురైలో జరిగిన ఈ సభలలో శరత్ కుమార్ సంచలన వాఖ్యలు చేశారు. 2026 ఎన్నికల్లో తనను  ముఖ్యమంత్రిని చేస్తే 150 బ్రతికేలా.. ఓ  జీవించే రహస్యం చెబుతానని ప్రజలను ఊరిస్తున్నాడు శరత్ కుమార్.  

నాకు ఇప్పుడు 69 ఏళ్లు.. కానీ 25 ఏళ్ల వ్యక్తిగానే భావిస్తాను. నేను 150 ఏళ్లు బతుకుతాను. వచ్చే ఎన్నికల్లో నన్ను సీఎంని చేస్తే.. అందరూ అన్నేళ్ళు బ్రతికే  ఉపాయం చెబుతా అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శరత్ కుమార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి. కొంత మంది పాజిటివ్ గా, కొంత మంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్