
తమిళ స్టార్ హీరో విజయ్ తళపతి (Vijay Thalapathy)కి సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. అటు తమిళ చిత్రాల్లో నటిస్తూనే ఇటు డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. గతంలో తను తమిళంలో చేసిన చిత్రాలను తెలుగు వెర్షన్ లోనూ విడుదల చేయడంతో ఇక్కడి ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాడు విజయ్. ఆయన స్టైల్, డాన్స్, యాక్టింగ్ తెలుగులోనూ వీరాభిమానులు ఉన్నారు. గతంలో ‘అదిరింది’, ‘బిజిల్’, ‘మాస్టర్’ సినిమాలో తెలుగు ఆడియెన్స్ ను అలరించాడు. చివరిగా ‘బీస్ట్’తో థియేటర్లలో సందడి చేశాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లోనే దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి తళపతి 66 చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న విజయ్ సరసన నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. అటు తమిళంలోనూ వరుస చిత్రాలను ప్రకటిస్తున్నారు. దీని తర్వాత ‘విక్రమ్’తో భారీ సక్సెస్ అందుకున్న లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించనున్నారు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో క్రేజీ ప్రచారం జరుగుతోంది. తళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay) ఎంట్రీ కోసం విజయ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
తన కొడుకు గ్రాండ్ లాంఛింగ్ కోసం విజయ్ ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలోనూ ‘తన కొడుకు సినీ రంగంలోకి వస్తే మాత్రం వద్దనని చెప్పడం’తో అప్పటి నుంచే ప్లాన్ మొదలైనట్టు సమాచారం. ఇందుకోసం విజయ్ మంచి కథలు కూడా వింటున్నారని తెలుస్తోంది. తండ్రి పోలికలు దగ్గరగా ఉండే సంజయ్ కూడా ఆడియెన్స్ ను మెప్పిస్తాడనే నమ్మకమూ నెలకొంది. ఇటీవల సంజయ్ తన తండ్రి సాంగ్ ‘వాతి కమింగ్’కు డాన్స్ చేస్తూ అందరికీ ఆకట్టుకునన్నాడు. సోషల్ మీడియాలో జాసన్ చాలా యాక్టివ్ గా ఉంటాడు.
జాసన్ సంజయ్ కెనడాలోని ఓ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్నాడు. ఈ కోర్సు తర్వాత జాసన్ సంజయ్ కోలీవుడ్ ఎంట్రీ పక్కా కానుందని సమాచారం. ఇంకా విజయ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2000లో పుట్టిన జాసన్ కు ప్రస్తుతం 21 ఏండ్లు నిండాయి. ‘వసంత ముల్లై’ పాటలో వేట్టైక్కారన్‌లో జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్‌తో కలిసి అతిథి పాత్రలో కనిపించాడు.