చిరంజీవి డాన్సులకు ఫిదా అయిన హాలీవుడ్‌ స్టార్‌ కమేడియన్‌..కేకలు పెడుతూ రచ్చ..

Published : Jun 20, 2022, 03:48 PM IST
చిరంజీవి డాన్సులకు ఫిదా అయిన హాలీవుడ్‌ స్టార్‌ కమేడియన్‌..కేకలు పెడుతూ రచ్చ..

సారాంశం

చిరంజీవి డాన్సులకు హాలీవుడ్‌ స్టార్‌ కమేడియన్‌ గాడ్‌ఫ్రే ఫిదా అయ్యారు. `దొంగ` చిత్రంలో `గోలీమార్‌`, `ముఠామేస్త్రీ` చిత్రంలోని `ఈ పేటకు నేనే మేస్ట్రీ` పాటకు ఆయన మంత్రముగ్దులయ్యారు. 

మెగాస్టార్‌ చిరంజీవి డాన్సులకు ఫిదా కానీ ఆడియెన్‌ ఉండరంటే అతిశయోక్తి కాదు. మైకేల్‌ జాన్సన్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా అద్భుతమైన డాన్సులేస్తూ ఉర్రూతలూగిస్తుంటారు. తాజాగా ఆయనకు డాన్సులకు హాలీవుడ్‌ స్టార్‌ కమేడియన్‌ గాడ్‌ఫ్రే ఫిదా అయ్యారు. `దొంగ` చిత్రంలో `గోలీమార్‌`, `ముఠామేస్త్రీ` చిత్రంలోని `ఈ పేటకు నేనే మేస్ట్రీ` పాటకు ఆయన మంత్రముగ్దులయ్యారు. ప్రశంసలతో ముంచెత్తారు. చిరంజీవి పాట వస్తున్నంత సేపు ఎంజాయ్‌ చేశారు. అరుపులతో గోల చేశారు. చిరంజీవి డాన్సులను మైకేల్‌ జాన్సన్‌తో పోల్చుతూ, ప్రశంసలు కురిపించారు. 

తెలుగు-అమెరికన్‌ స్టాండప్‌ కమేడియన్‌ విష్ణు వాకా నిర్వహించిన లైవ్‌ షోలో హలీవుడ్‌ కమేడియన్‌ గాడ్‌ఫ్రే పాల్గొన్నారు. లైవ్‌ షోలో మధ్యలో ఆయన ఇండియన్స్‌ గురించి ప్రస్తావించారు. ఇండియన్స్ ఎంత టాలెంటెడ్‌ అనే విషయాన్ని ఆయన వివరించారు. క్రేజీ పర్సన్స్ అని, వాళ్లు ఎంతో రాణిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో సినీ తారలకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు విష్ణువాకా.

ఆయనకు తాను పెద్ద అభిమానిని అని చెప్పగా, ఆయన గురించి తెలుసుకోవాలని కుతుహలం ప్రదర్శించారు గాడ్‌ఫ్రే. దీంతో మొదట చిరంజీవి నటించిన `దొంగ` చిత్ర క్లిప్స్ చూపించారు. ఇందులో `గోలీమార్‌` అంటూ వచ్చే చిరంజీవి డాన్సులను చూపించారు. అచ్చం మైకేల్‌ జాక్సన్‌ లాగే వేస్తున్నారంటూ ప్రశంసించారు. మైకేల్‌ జాక్సన్‌ డాన్సులతోనూ కంపేర్‌ చేయడం విశేషం. అనంతరం `ముఠామేస్ట్రి` చిత్రంలోని `ఈ పేటకు నేనే మేస్త్రీ` పాటని మరింతగా ఎంజాయ్‌ చేశారు. వాహ్‌ అంటూ ఇలా కూడా డాన్సు చేస్తారా అంటూ ఆద్యంతం తన ఆశ్చర్యానికి వ్యక్తం చేశారు. 

మొదట చిరు పేరును పలకడానికి ఇబ్బంది పడ్డ గాడ్‌ ఫ్రేకి చిరంజీవి పేరును ఎలా పలకాలో వివరించారు విష్ణు. మెగాస్టార్‌ ఇండియాలో పెద్ద స్టార్‌ అని చెబుతూ అతన్ని ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా అభిమానులు పిలుచుకుంటారని గాడ్‌ ఫ్రేకు చెప్పుకొచ్చారు. చిరంజీవి వేస్తున్న స్టెప్పులు చూసి ఈలలు, కేకలు వేస్తూ ఎంజాయ్‌ చేశారు  గాడ్‌ ఫ్రే. దీనికి సంబంధించిన లైవ్‌ వీడియోను విష్ణు వాకా ట్విట్టర్‌ ద్వారా సోషల్‌ మీడియా అభిమానులతో షేర్‌ చేశారు. ఈ ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. 

గాడ్‌ఫ్రే.. అమెరికా నటుడుగా, కమేడియన్‌గా రాణఙస్తున్నారు. `సోల్‌ ప్లేన్‌`, `ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టాస్‌`, `జూలాండర్‌`, `జాన్సన్‌ ఫ్యామిలీ వెకేషన్‌` వంటి సినిమాల్లో కమేడియన్‌గా నటించి ఆకట్టుకున్నారు. వీటితోపాటు షోస్‌, టెలివిజన్‌ సిరీస్‌ల్లో నటించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే