
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న సినిమా కంగువ. హిట్ డైరెక్టర్ శివ రూపోందిస్తున్న ఈసినిమా సూర్య 42వ సినిమాగా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈసినిమా నుంచి ఇప్పటికే కొన్ని అప్ డేట్స్ రాగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈసినిమాకు సబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియో లాంఛ్ చేయగా.. సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. ఇక తాజాగా సూర్యకు సబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడడు సూర్య. అంతే కాదు ఏజ్ ఎంత పెరుగుతున్నా.. ఏమాత్రం ఫిట్ నెస్ తగ్గకుండా మెనేజ్ చేసుకుంటున్నాడు సూర్య. 50 ఏళ్లకు మూడు అడుగుల దూరంలో ఉన్న తమిళ స్టార్ హీరో.. జిమ్ములో కుమ్ముతూ.. ఫిట్ గా తయారయ్యాడు. ఇక తాజాగా తాను చేస్తోన్న కంగువ సినిమా కోసం ట్రాన్స్‌ఫార్మేషన్ సెషన్‌లో సూర్య బిజీగా ఉన్నాడు. ప్రస్తతం ఆ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది .
కంగువ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు సూర్య. జిమ్ సెషన్‌లో సూర్య బిజీగా ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈసినిమాను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు దర్శకుడు, హీరో. లాస్ట్ మన్త్ లోనే కంగువ కొత్త షెడ్యూల్ షూటింగ్ ను కేరళలో స్టార్ట్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య జరిగే కీకల సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మొత్తంగా 10 భాషల్లో.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా భాషల్లో టైటిల్స్ కు సబంధించి చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈసినిమాను ౩డీ ఫార్మాట్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సూర్యకు ఇప్పటికే పలు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో మరోసారి దుమ్ము రేపబోతునోన్నారు.
సుమారు 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోంది. రోల్‌లో నటిస్తోంది. 2024 ఫస్ట్ హాఫ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య దీంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.