
సుడిగాలి సుధీర్ హీరోగా నూతన చిత్రం ప్రారంభమైంది. నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో నరేష్ కుప్పిలి పాగల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అనుకున్నంతగా ఆడలేదు. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ ప్లాప్ డైరెక్టర్ కి ఆఫర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరమయ్యాక ఆయన క్రేజ్ తగ్గింది. హీరోగా ఎదగాలనే క్రమంలో సుధీర్ కామెడీ షోస్, యాంకరింగ్ వదిలేయడం ఒక విధంగా మైనస్ అని చెప్పాలి.
గాలోడు మూవీతో తో హిట్ కొట్టి కూడా ప్లాప్ డైరెక్టర్ కి ఆయన ఛాన్స్ ఇచ్చారు. అయితే సుడిగాలి సుధీర్ కి నరేష్ కుప్పిలి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే చేశాడని సమాచారం. మే 12న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సుడిగాలి సుధీర్ 4వ చిత్రం ఇది తెరకెక్కుతుంది. సుధీర్ కి జంటగా యంగ్ బ్యూటీ దివ్య భారతి నటిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు సమాచారం. జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ స్టార్ యాంకర్ గా ఎదిగారు. ఆ ఫేమ్ తో ఆయన హీరోగా మారారు. సుడిగాలి సుధీర్ డెబ్యూ మూవీ సాఫ్ట్ వేర్ సుధీర్ నిరాశపరిచింది. తన ఇద్దరు మిత్రులు గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ లతో కలిసి త్రీ మంకీస్ టైటిల్ తో ఓ మూవీ చేశారు. అది కూడా ఆడలేదు. గాలోడు ఆయనకు సక్సెస్ రుచి చూపించింది. కాలింగ్ సహస్ర టైటిల్ తో సుడిగాలి సుధీర్ ఓ మూవీ చేస్తున్నారు. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు.
గాలోడు సక్సెస్ నేపథ్యంలో ఆయనకు విరివిగా అవకాశాలు వస్తాయని భావించారు. ఆ జోరు కనిపించడం లేదు. మిస్టర్ పర్ఫెక్ట్ ఫేమ్ దశరథ్ దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ ఓ మూవీకి సైన్ చేశారని ప్రచారం జరిగింది. అధికారిక సమాచారం మాత్రం లేదు. ఇక బుల్లితెర ఆడియన్స్ సుధీర్ ని బాగా మిస్ అవుతున్నారు. సినిమాలు చేసినా బుల్లితెరను వీడను అని గతంలో సుధీర్ చెప్పారు. ఆ సూచనలు ఏం కనబడటం లేదు.