Surya experimental movie: జ్యోతికతో కలిసి మరో ప్రయోగానికి సిద్థమైన సూర్య... ఏం చేయబోతున్నాడంటే...?

Published : Mar 06, 2022, 03:37 PM IST
Surya experimental movie: జ్యోతికతో కలిసి మరో ప్రయోగానికి సిద్థమైన సూర్య... ఏం చేయబోతున్నాడంటే...?

సారాంశం

సినిమా విషయంలో ఎంత కొత్తగా ఆలోచించాలో తెలిసిన హీరో సూర్య(Surya). అందుకే ఆయన సినిములు మంచి విజయాలుగా నిలుస్తాయి, అంతే కాదు సినిమా హిట్ అవ్వకపోయినా.. సూర్య(Surya) ఇమేజ్ కు మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు.

సినిమా విషయంలో ఎంత కొత్తగా ఆలోచించాలో తెలిసిన హీరో సూర్య(Surya). అందుకే ఆయన సినిముల మంచి విజయాలుగా నిలుస్తాయి, అంతే కాదు సినిమా హిట్ అవ్వకపోయినా.. సూర్య(Surya) ఇమేజ్ కు మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. 

తమిళ స్టార్ హీరో సూర్య(Surya) మొదటి నుంచి కూడా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తున్నాడు.కొత్త కొత్త కథలను వెతికి మరీ సెలక్ట్ చేసుకుంటాడు సూర్య.   అంతే కాదు సోషల్ మెసేజ్ ఇచ్చే  సినిమాలలో పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని చూపుతాడు సూర్య. ఆ మధ్య ఆకాశమే నీ హద్దుర తో పాటు జై భీమ్ సినిమాతో అదరగొట్టాడు సూర్య(Surya). ఈ రెండు సినిమాలు సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కలిసి ఉండటంతో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 

ఇక ఆయన రీసెంట్ సినిమా ఈటి.. ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ కు కూడా భారీ రెస్సాన్స్ వచ్చింది. ప్రయాంక అరుళ్ మోహాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హిట్ పై సూర్య(Surya) చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈమూవీ హిట్ అయితే.. ఆయన హ్యాట్రిక్ కొట్టినట్టే.

ఇక ఈటి  సినిమా తరువాత సూర్య(Surya)తో సినిమా కోసం చాలా మంది దర్శకులు లైన్ లో ఉన్నారు. అంతే కాదు బోయాపాటి శ్రీనుతో కలిసి డైరెక్ట్ తెలుగు మూవీ చేయడానికి కూడా సూర్య ప్రయత్నిస్తున్నారు. కాని ఈ ప్రాజెక్ట్ కు ఇంకా టైమ్ పట్టే అవకాశాలు ఉన్నాయి. అటు తమిళం నుంచీ.. వెట్రిమారన్.. బాలా లాంటి దర్శకుల ప్రాజెక్టులను సూర్య లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలను ఆయన ఒకే సమయంలో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఇందులో బాలా డైరెక్షన్ లో చేయబోయేది ప్రయోగాత్మక సినిమా అని తెలుస్తోంది. 

డైరెక్టర్ బాలా అంటేనే ఎక్స్ పెర్మెంట్ల కింగ్. ఆయన ఏ సినిమా చేసినా.. ఎంత చిన్న సినిమా చేసినా.. అది ప్రయోగాత్మక చిత్రమని చెప్పేయవచ్చు. అలాగే సూర్యతో కూడా ఆయన ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ను తీసుకుని సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇందులో సూర్య(Surya) ద్విపాత్రాభినయం చేయనున్నాడని  సమాచారం.  

సూర్య(Surya) ఇప్పటి వరకూ చేయని  చెవిటి - మూగ పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు. గతంలో సూర్య సుందరాంగుడు సినిమాలో పొట్టి గూని పాత్రలో నటించారు. ఇప్పుడు మూగ, చెవిటి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కు హీరోయిన్ గా ఆయన సతీమణి జ్యోతిక కనిపించబోతుందని కోలీవుడ్ సమాచారం. ఇక గతంలో సూర్య(Surya) ద్విపాత్రాభినయం చేసిన బ్రదర్స్ ..24, సెవెంత్ సెన్స్ సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి సూర్య చేస్తున్న ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందన్నది చూడాలి.
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?