
థర్డ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో సినిమాల జాతర షురూ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం మార్కెట్ గా గ్రాండ్ గా ఓపెన్ చేసింది. అదే జోష్ తో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. భీమ్లా నాయక్ చిత్రాన్ని ఏపీ ప్రభుత్వం కఠినంగా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రమే కాదని.. అన్ని చిత్రాలకు ఇవే రూల్స్ అని చెబుతోంది. టికెట్ ధరలు పెంచుకునేలా, అందనపు షోలు ప్రదర్శించుకునేలా ఏపీ సర్కార్ ఇంకా కొత్త జీవో విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో అందిరి కళ్ళు రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలపై పడ్డాయి.
ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం అనుకూలంగా లేకుంటే ఏంటి పరిస్థితి అనే కోణంలో ఆర్ఆర్ఆర్ టీం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి విడుదలకు ముందురోజు రాత్రి ప్రీమియర్, బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే వచ్చే క్రేజే వేరు.
కానీ ప్రభుత్వం మాత్రం స్ట్రిక్ట్ గా 4 షోల నిబంధన అమలు చేస్తోంది. దీనితో ఆర్ఆర్ఆర్ టీం మరో విధంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో పైడ్ ప్రీమియర్స్ ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వాన్ని రిక్వస్ట్ చేయనుందట. మరి దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి.
ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం త్వరలో 5 షోలకు అనుమతి ఇస్తుందని అంటున్నారు. తెలంగాణాలో సినిమా టికెట్ ధరలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. భీమ్లా నాయక్ చిత్రానికి తొలి వారంలో 5 షోలు ప్రదర్శించుకునేలా అనుమతి కూడా ఇచ్చారు.