ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు యంగ్ స్టార్ డైరెక్టర్ మద్దతు, వైరల్ అవుతున్న పా. రంజిత్ ట్వీట్

Published : Sep 06, 2023, 02:22 PM ISTUpdated : Sep 06, 2023, 02:23 PM IST
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు యంగ్ స్టార్ డైరెక్టర్ మద్దతు, వైరల్ అవుతున్న పా. రంజిత్ ట్వీట్

సారాంశం

సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి.. సినీనటుడు, ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. చాలా మంది ఉదయనిధి వ్యాక్యలకు మండిపడుతుంటే.. కొంత మంది మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ ఆయనకు మద్దతుగా నలిచారు. తన సపోర్ట్ ను ప్రకటించారు.   


సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి.. సినీనటుడు, ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. చాలా మంది ఉదయనిధి వ్యాక్యలకు మండిపడుతుంటే.. కొంత మంది మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ ఆయనకు మద్దతుగా నలిచారు. తన సపోర్ట్ ను ప్రకటించారు. 

ప్రస్తుతం తమిళ రాజకీయం సనాతన ధర్మం చుట్టు తిరుగుతుంది. డీఎంకే నేత‌, మంత్రి, సినీ నటుడు, నిర్మాత ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhyanithi Stalin) స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని చేసిన  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు  పెద్ద దుమారాన్నేరేపుతున్నాయి. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఒక్క తమిళనాట మాత్రమే కాకుండా..దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్‌ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర వ్యాతిరేకత రాగా.. మతపెద్దలు, అర్చక సంఘాలు, బ్రహ్మణసంగాలు సహా.. మరి కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శల దాడి  చేస్తున్నారు. 

అయితే ఇంత రచ్చ జరుగుతున్నా.. ఈ తను చేసిన వ్యాక్యల విషయంలో ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు  ఉదయనిధి స్టాలిన్. తన వ్యాఖ్యలను గట్టిగా సమర్ధిస్తూ.. తను మాట్లాడిన మాటల్లో తప్పులేదంటూ సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాఖ్య‌ల‌కు కబాలి , కాలా , సార్పట్ట పరంపర సినిమాల దర్శకుడు పా.రంజిత్ (PA. Ranjith) మ‌ద్ద‌తు ఇచ్చారు. స్టాలిన్ విషయంలో జరుగుతున్న మాటల ధాడితో పాటు.. ఆయనపై జరుగుతున్న ప్రచారం పై ఆందోళన వ్యక్తం చేశారు. 

 

పా రంజిత్ ట్వీట్ చేస్తూ... స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాలి అనేది దశాబ్దాలుగా జ‌రుగుతున్న కుల వ్యతిరేక పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం. కుల వివక్ష, లింగ వివక్ష అనేవి సనాతన ధర్మం నుండి వ‌చ్చిన‌వే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Dr Babasaheb Ambedkar), ఇయోథీదాస్ పండితార్, తంతి పెరియార్, మహాత్మా ఫూలే, సంత్ రవిదాస్ వంటి విప్లవకారులు పోరాడింది కూడా కుల వివక్ష నిర్మూలించాలనే.

ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి మారణహోమానికి పిలుపునిస్తున్నారు. ఈ దుర్మార్గపు వైఖరి మంచిది కాదు. స్టాలిన్‌పై చంపేయాలని వ‌స్తున్న ప్ర‌క‌ట‌న‌లు.. ఆయ‌న‌పై పెరుగుతున్న ద్వేషం చాలా కలవరపెడుతోంది.సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన ఉదయనిధి స్టాలిన్ మాటలకు నేను మద్దతుగా నిలుస్తున్నాను. స్టాలిన్‌కి నా సంఘీభావం అంటూ” పా. రంజిత్ ట్విట్ట‌ర్‌లో రాసుకోచ్చాడు.

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?