తమిళ స్టార్ హీరో ధనుష్ తనయుడు చేసిన పనికి పోలీసులు జరిమానా విధించారు. బడా హీరో కొడుకునూ అధికారులు ఏమాత్రం వదిలిపెట్టలేదు. ఇంతకీ ఆ స్టార్ కిడ్ ఏం చేశారంటే?
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారు. అయితే ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. వీరి షాకింగ్ డివోర్స్ తర్వాత తనయులు ఇద్దరూ తల్లి ఐశ్వర్యతోనే ఉంటున్నారు. ఇప్పటీ వరకు వీరి ప్రస్థావన పెద్దగా రాలేదు. ఇద్దరూ తమ స్కూలింగ్ ను చక్కగా పూర్తి చేసుకున్నారు.
రీసెంట్ గా దీపావళి పండుగ సందర్భంగా మనవళ్లు ఇద్దరూ తాత రజినీకాంత్ పాదాలకు సాక్షాంగ నమస్కారం చేసి దీవెనలు తీసుకున్న విషయం తెలిసిందే. అంత మంచి పేరు దక్కంచుకున్నారు. ఈలోగా ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ధనుష్ పెద్ద కొడుకు చేసిన పనికి అధికారులు జరిమానా విధించడం ఆశ్చర్యంగా మారింది.
undefined
ఇంతకీ ఏం జరిగిందంటే.. ధనుష్ పెద్దకొడుకు యాత్ర (Yatra) తాజాగా ట్రాఫిక్ పోలీస్ లకు చిక్కారు. ఇటీవల కొత్త ఇంటికి మారిన ధనుష్ పోస్ గార్డెన్ ఏరియాలో స్టోర్స్ బైక్ పై ఓవర్ స్పీడ్ తో రైడ్ చేశారు. అప్పటికే అతని టూవీలర్ డ్రైవ్ చేయడం ఎలా అసిస్టెంట్ నేర్పించారని తెలుస్తోంది. ఏదేమైనా యాత్ర రైడ్ కు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే రైడ్ చేసే సమయంలో యాత్ర ఫేస్ మాస్క్ పెట్టుకున్నారు. దీంతో ఆ బైక్ నెంబర్ ప్లేట్ ను పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు ధనుష్ కొడుకు అని గుర్తించారు. ఈ సందర్భంగా వాయిలెన్స్ క్రియేట్ చేసినందుకు రూ.1000 జరిమానా విధించారు. పబ్లిక్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ రైడ్ చేసి, ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసినందుకు ఫైన్ వేసినట్టు అఫీషియల్స్ చెప్పుకొచ్చారు.
ఇక ధనుష్ - ఐశ్వర్య షాకింగ్ గా డివోర్స్ మ్యాటర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. మళ్లీ వీరిని కలిపేందుకు ఇరుకుటుంబ సభ్యులు కృషి చేస్తున్నారు. త్వరలో వీరు కలుస్తారని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మున్ముందుకు దీనిపై ఏం జరుగుతుందనేది ఆసక్తి నెలకొంది. ధనుష్ కెరీర్ లో మాత్రం దూసుకుపోతున్నారు. తెలుగులో ‘సార్’ చిత్రం తర్వాత D51ను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నారు. అటు భారీ యాక్షన్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.