Kamal Haasan: ఆంధ్రా అంతటా తిరుగుతున్న కమల్ హాసన్, విశాఖపట్నంలో ఇండియన్ 2 షూటింగ్,

Published : Nov 18, 2023, 02:33 PM ISTUpdated : Nov 18, 2023, 02:35 PM IST
Kamal Haasan: ఆంధ్రా అంతటా తిరుగుతున్న కమల్ హాసన్, విశాఖపట్నంలో ఇండియన్ 2 షూటింగ్,

సారాంశం

ఆంధ్రలో  ఇండియన్ 2 వరుస షెడ్యూల్స్ ను  ప్లాన్ చేస్తున్నారు కమల్ హాసన్ టీమ్. ఇప్పటికే చాలా రోజులుగా ఆంధ్రాలో మకాం వేసింది టీమ్.. తాజాగా  ఇండియన్ 2 టీమ్ వైజాగ్ చేరింది.   

లోకనాయకుడు కమల్ హాసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. విక్రమ్ సినిమాతో ఆయన మళ్ళీ పుంజుకున్నాడు. ఇదే ఊపుతో కమల్ భారతీయుడు 2 సినిమాను లైన్ లో పెట్టాడు. లోక నాయకుడు.. నట కమలం..  కమల్ హాసన్ హీరోగా శంకర్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు. ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు భారతీయుడు సినిమాకుసీక్వెల్ చేస్తున్నారు. దాదాపు చివరి దశలో ఉంది షూటింగం. భారతీయుడు 2 గా తెరకెక్కుతోన్న.. ఈసినిమాలో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

కొన్ని కారణాల వల్ల ఈమూవీ డిలై అవుతూ వచ్చింది. కొన్నాళ్లు ఆగిపోయింది కూడా. గత కొన్నేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడంతో షూటింగ్ చివరి దశకు వచ్చింది అంనుకున్నారు అంతా. ఇక ఈ చిత్రం షూటింగ్ ని అయితే దర్శకుడు శంకర్ వరల్డ్ వైడ్ గా అనేక ప్రాంతాల్లో తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా భారతీయుడు టీమ్ ఆధ్రా చేరారు. ప్రతి చోట కూడా తనదైన భారీతనంతో శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

ఇండియన్ 2' సినిమా "షూటింగ్ ప్రస్తుతం  విశాఖపట్నంలో జరుగుతోంది. విశాఖలోని హార్బర్ ఏరియా, పరిసర ప్రాంతాలలో కమల్ హాసన్ సహా ఇతర మెయిన్ కాస్ట్ తో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు  దర్శకుడు శంకర్. ఈనెల 14న విశాఖలో ఇండియన్ 2 షెడ్యూల్ ప్రారంభమైంది. సుమారు ఎనిమిది రోజుల పాటు షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట.  షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో విశాఖ షెడ్యూల్ పూర్తి కావాలి.  

మొన్నటి వరకూ  బెజవాడలో షూటింగ్ జరుపుకున్నారు ఇండియన్ 2 టీమ్. ఇక్కడ ఓ క్రేజీ సీక్వెన్స్ ను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్  కోసం 8000 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకున్నట్టు సమాచారం.విజయవాడలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో అయితే షూట్ చేశారట. అంతే కాదు... షూటింగ నిమిత్తం విజయవాడ వచ్చిన కమల్ హాసన్ అక్కడ కృష్ణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన