పేకాట నాలెడ్జ్ గేమ్, శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, తమిళనాట రచ్చ చేస్తున్న రమ్మీ గేమ్

Published : Dec 14, 2022, 02:28 PM IST
పేకాట నాలెడ్జ్ గేమ్, శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, తమిళనాట రచ్చ చేస్తున్న రమ్మీ గేమ్

సారాంశం

తమిళ సీనియర్ నటుడు.. ప్రముఖ రాజకీయ నాయకుడు శరత్ కుమర్ సంచల వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఆన్ లైన్ గేమ్ రమ్మీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాట  చర్చనీయాంశం అవుతున్నాయి.


ప్రముఖ నటుడు, తమిళ రాజకీయ నాయకుడు శరత్ కుమార్ ఆన్ లైన్ లో పేకాటకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తమిళ నాట చర్చనీయాంశం అవుతున్నాయి. రమ్మీ ఒక నాలెడ్జ్ గేమ్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీతో పాటు బెట్టింగ్ గేమ్ ను నిషేదిస్తూ..అక్కడి ప్రభుత్వం కొత్త జీవోను తీసుకువచ్చింది. అయితే  ఆ జీవో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండటంతో.. ఈ ఇష్యూ హాట్ హాట్ గా నడుస్తోంది తమిళనాట. ఈ విషయంలో శరత్ కుమార్ ను ప్రశ్నించింది తమిళ మీడియా. 

అయితే శరత్ కుమార్ ఆన్ లైన్ రమ్మీకి బ్రాండ్ గా చేశారు. ఈ యాడ్ లో ఆయన నటించారు. ఈ గేమ్ సంబంధించి అన్ని రకలుగా శరత్ కుమార్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. దాంతో ఆనపై పెద్ద ఎత్తున విమర్షలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే శరత్ కుమార్ ను మంగళవారం ప్రశ్నించారు మీడియా ప్రతినిథులు. దానికి ఆయన సమాధానం చెపుతూ.. రమ్మీ ఒక నాలెడ్జ్ గేమ్. దీన్లో తప్పేముంది అన్నారు. అంతే కాదు ప్రభుత్వం ఈ జీవో ఇవ్వడానికంటే ముందు.. అంటే రెండేళ్ల క్రితం తాను ఆఆడ్ లో నటించానన్నారు శరత్ కుమార్. 

 

 

ఈసందర్భంగా పలు విషయాలనై ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను చెప్పినంత మాత్రాన అందరూ పేకాట ఆడేస్తారా..? ఇంత నిజాయితీగా పార్టీ పెట్టి ప్రజాసేవ చేస్తుంటేనే జనాలు ఓట్లు వేయడంలేదు. మరి తాను ఆడమంటే రమ్మీ ఆడేస్తారా అంటూ.. డిఫరెంట్ గా మాట్లాడారు శరత్ కుమార్. అంతే కాదు రమ్మీ మేధో శక్తిని పెంచుతుంది అని ఆయన చేసిన వాఖ్యలు అక్కడ ప్రకంపణలు పుట్టిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Suriya Jyotika Mumbai House: భార్య కోసం షాకింగ్ డెసిషన్.. సూర్య రూ.200 కోట్ల ఇల్లు ఎందుకు వదిలేశాడో తెలుసా ?
Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ