
తమిళనాట దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న విజయ్ ఈమధ్య పలు దఫాలుగా అభిమాన సంఘాలతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తెలుగు దర్శకుడు వంశీపైడి పల్లి డైరెక్షన్ లో వారసుడు మూవీ చేస్తున్నాడు. తమిళ నాట వారీసు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈక్రమంలో వారీసు రిలీజ్ పై ఓ ట్వీస్ట్ నెలకొంది.
సంక్రాంతి కానుకగా వారీసు సినిమాను రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు మేకర్స్. కరెక్ట్ గా అదే టైమ్ కు తమిళనాటు ఇంతే స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అజిత్ తునివు కూడా రిలీజ్ కాబోతుంది. ఈ ఇద్దరు స్టార్ల సినిమాల మధ్య పోటీ అంటే.. అది ఫ్యాన్ వార్ అన్నట్టే లెక్క. గతంలో కూడా వీరి ఫ్యాన్స్ మధ్య భారీ స్థాయలో వార్ జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈక్రమంలో మరోసారి పొంగల్ వార్ లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు నిలవడంతో.. కోలీవుడ్ సర్కిల్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అటు వారీసు రిలీజ్ పై రకరకాల వివాదాలు నెలకొన్న నేపథ్యంలో.. మంగళవారం చెన్నైలో కొన్ని అభిమాన సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు విజయ్. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి. ఒక వేల పొంగల్ బరిలో సినిమా రిలీజ్ అయితే.. వివాదాలు.. గొడవలు లేకుండా రిలీజ్ ప్రశాంతంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి మూడు జిల్లాల అభిమానులు రాగా.. ఆమధ్య మరో మూడు జిల్లాల అభిమానులతో ఆయన సమావేశం జరిగింది. ఇలా వరుసగా మరికొన్ని సమావేశాలు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తుంది. రాజకీయాల్లోకి విజయ్ వచ్చే అవకాశం ఉండటంతో.. ఈ విషయంపై కూడా రహస్యంగా అభిమానులతో ఆయన చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. బయటకు రానీయకుండా లోలోపల ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక అభిమానులతో విజయ్ సమావేశానికి సబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుడైన అభిమానిని విజయ్ ఎత్తుకుని ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.