మహేష్ తండ్రిగా అమితాబ్... అలా సెట్ చేసిన రాజమౌళి!

Published : Dec 14, 2022, 01:47 PM IST
మహేష్ తండ్రిగా అమితాబ్... అలా సెట్ చేసిన రాజమౌళి!

సారాంశం

మహేష్ ప్రాజెక్ట్ ని రాజమౌళి గత చిత్రాలకు మించి తెరకెక్కించనున్నారు. దీని కోసం భారీ క్యాస్టింగ్, ఉన్నతమైన సాంకేతిక నిపుణులను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో మహేష్ తండ్రిగా అమితాబ్ బచ్చన్ ని నటిస్తున్నారన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.   

ఇప్పటి వరకు రాజమౌళి చేసిన చిత్రాలు ఒకెత్తు... మహేష్ తో చేసే మూవీ మరొక ఎత్తు. పాన్ వరల్డ్ మూవీగా భారీ ఎత్తున ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. బడ్జెట్ కూడా ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2 చిత్రాలకు డబుల్ ఉంటుందని సమాచారం. మహేష్ కోసం రాజమౌళి ఎంచుకున్న జోనర్ భారీ బడ్జెట్ కి కారణం. 

జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో తెరకెక్కుతున్న నేపథ్యంలో  విఎఫ్ఎక్స్ వర్క్, లొకేషన్స్, సెట్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నారు. అదే స్థాయిలో క్యాస్టింగ్ కి ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. సినిమా స్కేల్ కి తగ్గట్లు స్టార్స్ ని మూవీలో భాగం చేయనున్నారు. ఈ క్రమంలో ఒక క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ మహేష్ తండ్రి పాత్ర చేస్తున్నారట. ఈ మేరకు అమితాబ్ తో చర్చలు జరుపగా... ఆయన పచ్చజెండా ఊపారట. 

కథలో కీలకమైన మహేష్ తండ్రి పాత్రలో అమితాబ్ కనిపించడం అనివార్యమే అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక రాజమౌళి లేటెస్ట్ రిలీజ్ ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం ఇంకా తగ్గలేదు. జపాన్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. అలాగే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ కొల్లగొడుతుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?