దాని వల్ల 200 కోట్లు నష్టం వచ్చిందంట

First Published 15, Apr 2018, 2:59 PM IST
Highlights

దాని వల్ల 200 కోట్లు నష్టం వచ్చిందంట

లెలుగువాళ్లకు ఉగాది తమిళవాళ్లకు ఏప్రిల్ 14 వాళ్లకు అంత ప్రత్యేకం అన్నమాట. ఆ రోజు తమిళ సంవత్సరాది. ఆ రోజు అక్కడ సందడి మామూలుగా ఉండదు ఆ పండుగను అంత ఆనందంగా చేసుకుంటారు. మామూలుగా ఈ డేట్ కు భారీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి థియేటర్లు కళ తప్పి వెలవెలబోతున్నాయి. నెలన్నరగా తమిళనాడులో థియేటర్లు మూత పడి ఉన్న సంగతి తెలిసిందే.సమ్మె కారణంగా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించడం లేదు. నెల రోజుల తర్వాతైనా పరిస్థితి మారుతుందని ఆశిస్తే అదేమీ జరగలేదు.

సినిమాలకు చాలా మంచి సీజన్ అయిన వేసవిలో థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే సమ్మె కారణంగా తమిళ సినీ పరిశ్రమకు రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. సమ్మె లేకుంటే ఇప్పటికే మూణ్నాలుగు భారీ సినిమాలు రిలీజై ఉండేవి. ఈపాటికి ‘కాలా’ సందడి మొదలయ్యేది. ఆ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. రజినీ సినిమా అంటే రెండు వారాల ముందు నుంచే హంగామా మొదలవుతుంది. కానీ ఈ సినిమాను సమ్మె కారణంగా జూన్ కు వాయిదా వేసేశారు. అసలు ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తుందనే విషయంలో స్పష్టత కూడా లేదు. సినిమాలపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. కానీ ఒక గొప్ప మార్పు వైపు అడుగులేస్తున్న తరుణంలో ఇలాంటి కష్టాలు తప్పవని అంటోంది విశాల్ నేతృత్వంలోని నిర్మాతల మండలి. మరి ఈ సమ్మె ఎప్పటికి తెగుతుందో చూడాలి.

Last Updated 15, Apr 2018, 2:59 PM IST