కాలు కదపలేని స్థితిలో ఒకప్పటి యాక్షన్ హీరో... మరింత దయనీయంగా విజయకాంత్ పరిస్థితి 

Published : Feb 02, 2023, 01:11 PM ISTUpdated : Feb 02, 2023, 01:15 PM IST
కాలు కదపలేని స్థితిలో ఒకప్పటి యాక్షన్ హీరో... మరింత దయనీయంగా విజయకాంత్ పరిస్థితి 

సారాంశం

యాక్షన్ హీరోగా కోలీవుడ్ లో స్టార్డం అనుభవించిన విజయకాంత్ పరిస్థితి దయనీయంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయకాంత్ నడవలేని స్థితిలో ఉన్నారు.   

80-90లలో స్టార్ గా కోలీవుడ్ లో వెలిగిపోయారు విజయకాంత్. యాక్షన్ హీరోగా ఆయనకు తెలుగులో కూడా మార్కెట్ ఉండేది. రజినీకాంత్, కమల్ హాసన్ చిత్రాలతో పాటు విజయకాంత్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడేవారు. కొన్ని సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. పవర్ ఫుల్ పోలీసుల పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

2005లో ఆయన డి ఎం డి కే పేరుతో పొలిటికల్ పార్టీ ప్రకటించారు. ఆ నెక్స్ట్ ఇయర్ 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేశారు. అయితే వ్రిధాచలం నియోజకవర్గం నుండి తాను ఒక్కడే గెలిచారు. 2011 ఎన్నికల్లో సైతం ఆయన రిషివందియం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. మూడోసారి ఆయన ఓడిపోయారు. 

2010లో చాలా గ్యాప్ తర్వాత విజయకాంత్ హీరోగా మూవీ చేశారు. విరుధగిరి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన దర్శకుడు కూడాను. చివరిగా 2015లో ఓ మూవీలో ఆయన క్యామియో రోల్ చేశారు. కొన్నాళ్లుగా విజయకాంత్ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒకటి రెండు సార్లు విషమ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఆయన కాలి వేళ్లలో మూడింటిని తొలగించారు. 

దీంతో విజయకాంత్ నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆయన చక్రాల కుర్చీకే పరిమితమైనట్లు సమాచారం. తాజాగా ఆయన ఫోటోలు బయటకు వచ్చాయి. హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆయన్ని కలిశారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. విజయకాంత్ తో విజయ్ తండ్రికి గట్టి అనుబంధం ఉంది. దర్శకుడిగా చంద్రశేఖర్ విజయకాంత్ తో పలు చిత్రాలు తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగా పరిచయమైంది విజయకాంత్ చిత్రంతోనే. ఈ క్రమంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 

విజయకాంత్ ని కలిసిన ఫోటోలు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. విజయకాంత్ ప్రస్తుత లుక్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద సింహంలా గర్జించిన విజయకాంత్ ఇలా అయిపోయారేంటని వేదన చెందుతున్నారు. షుగర్ కారణంగా విజయకాంత్ బాగా సన్నబడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?