తమిళ స్టార్ హీరో విజయ్ మంచి మనసు, పేద పాపకు డైమండ్ నక్లస్ తో సర్ ప్రైజ్..

Published : Jun 17, 2023, 07:06 PM IST
తమిళ స్టార్ హీరో విజయ్ మంచి మనసు, పేద పాపకు డైమండ్ నక్లస్ తో సర్ ప్రైజ్..

సారాంశం

తమిళ్ తో పాటు సౌత్ అంతా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు దళపతి విజయ్.  రీల్ హీరోనే కాదు రియల్ లైఫ్ లో.. ఎంతో మంచి మనిషి ఆయన. తాజాగా ఆయన ఓ పాపకు డైమెంట్ నెక్లస్ గిఫ్ట్ గా ఇచ్చారట. ఎందుకు ఏంటీ అనేది చూద్దాం. 

తాజాగా హీరో దళపతి  విజయ్ తన మంచి మనసు చాటుకున్నాడు.  ఓ అమ్మాయికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చి తన ఉన్నతమైన మనస్తత్వాన్ని చాటుకున్నాడు. దాంతో టాలీవుడ్ ఆడియన్స్ కూడా  విజయ్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటీ..? విజయ్ ఎందుకు ఆ పాపకు గిఫ్ట్ ఇచ్చాడు..? అసలు సంగతి ఏంటంటే..? 

తమిళనాట తాజాగా ఎక్జామ్ రిజల్ట్ వచ్చాయి. అయితే ఈ ఫలితాల్లో టాప్ 3గా ఉన్నవారిని స్టార్ హీరో విజయ్ దళపతి సన్మానించారు. విజయ్ పీపుల్స్ మూమెంట్ లో ఓ ఈవెంట్ జరిగింది. ఫలితాల్లో టాప్-3లో నిలిచిన విద్యార్థులను హీరో విజయ్ సన్మానించారు. వారికి రకరకాల బహుమతులు కూడా  కూడా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఇక తమిళనాడు ప్రభుత్వం రిలీజ్ చేసిన ఇంటర్ ఫలితాలలో.. ఒక అమ్మాయి అందరిని ఆశ్చర్యపరిచింది. తన మార్కులతో అందరికి దృష్టిని ఆకర్జించింది. 

ఇంతకీ ఆ అమ్మాయికి  ఎన్ని మార్కులు వచ్చాయంటే..  600 మార్కులకి 600 మార్కులు సాధించింది చిన్నారి. 100 పర్సంట్ మార్కులతో.. అందరి దృష్టిని ఆకర్షించిన ఆ అమ్మాయిని ప్రోత్సహించి.. ఇంకా పై చదువులు చదువుకునేలా  ఉండటానిని విజయ్ ఆమెకు కాస్ట్లీ బహుమతి ఇచ్చాడు.  హీరో విజయ్ ఆమెకు డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ప్రస్తుత రాజకీయాలపై మన కోలీవుడ్ హీరో విజయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్పందించారు. మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు. ఓట్లను డబ్బులకు అమ్ముకోవద్దని స్టూడెంట్స్‌కి చెప్పారు. రేపటి పౌరులు.. రేపటి ఓటర్లు.. భవిష్యత్ నాయకులు కూడా మీరే అని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. రేపటి భవిష్యత్ కూడా మీ చేతులోనే ఉందని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా