ఫ్రెండ్ కోసం కారు కొన్న హీరో దృవ్ సర్జా.. ఎన్ని లక్షలు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు.

Published : Jun 17, 2023, 06:38 PM IST
ఫ్రెండ్ కోసం కారు కొన్న హీరో దృవ్ సర్జా.. ఎన్ని లక్షలు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు.

సారాంశం

ఫ్యామిలీ కోసం ఖర్చుకు వెనకాడని వారిని చూసి ఉంటాం కాని.. స్నేహం కోసం ఏమాత్రంఆలోచించకుండా కర్చు పెట్టేవారు ఎవరుంటారు.. ? ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే వన్ అండ్ ఓన్లీ దృవ్ సర్జా ఉన్నాడు. ఫ్రెండ్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా..?   

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ ఉన్న హీరలలో కన్నడ నాట దృవ్ సర్జా కూడా ఒకరు.తమిళ స్టార్ హీరో అర్జున్‌ సార్జా నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ధ్రువ సార్జా. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ టైమ్ లోనే యూత్ లో మంచి  పాపులారిటీ తో పాటు.. మాస్ ఇమేజ్ కూడా తెచ్చుకున్ాడు. చూడటానికి హాలీవుడ్ హీరోల ఉంటాడు. లేదంటే.. పక్కా మాస్ హీరోలా కనిపిస్తుంటాడు. విలన్ లుక్ లో కూడా కనిపిస్తుంటాడు దృవ్. 

 కేవలం ఆరు సినిమాలతోనే కన్నడ నాట స్టార్‌ హీరోగా మారిపోయారు అర్జున్ మేనల్లుడు. 2021లో వచ్చిన పొగరు సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయం అయ్యారు. ఇది డబ్బింగ్‌ సినిమా అయినప్పటికి అతడికి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం దృవ్ సర్జా  మార్టిన్‌ అనే ప్యాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. 

అయితే సర్జా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కు బాగా వాల్యూ ఇస్తారు. దృవ్ సర్జా అన్న.. దివంగత చిరంజీవి సర్జా కూడా ఎప్పుడూ ఫ్రెండ్స్ ను వెంటేసుకుని ఉండేవారు. ఆయన అకాలమరణంతో ఫ్యామిలీ అంతా.. తీరని శోకంలో మునిగిపోయి ఉన్నారు. ఇక అన్నలాగానే ధృవ్ సర్జా కూడా స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు. వారి అవసరాలను తెలుసుకుని మరీ సహాయం చేస్తుంటారు. అతే కాదు తమలో ఒకరిగా చూసుకుంటారు. ఈక్రమలోనే ఆయన తన స్నేహితుడికి ఓ కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఆ కారు ఖరీదు తెలిస్తే.. మనం కూడా ఆశ్చర్యపోవాల్సిందే. 

దృవ్ సర్జా  తన మిత్రుడి పుట్టిన రోజు నాడు అతడికి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చారు. అత్యంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. దాదాపు 52 లక్షల రూపాయలు విలువ చేసే కారును తన ప్రాణ స్నేహితుడు అశ్విన్‌కు కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి...ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు ధ్రువ సార్జాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

కాగా, ధ్రువ సర్జా, అశ్విన్‌ల స్నేహం గురించి కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తానికి తెలుసు. ధ్రువ సార్జా ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఏ షూటింగ్‌కు వెళ్లినా అశ్విన్‌ ఆయన వెంటే ఉంటారు. ఇక, ఫ్యాన్స్‌ విషయంలోనూ ధ్రువ చాలా ఉదారంగా ఉంటారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?