
యాంగ్రీ స్టార్ రాజశేఖర్(Rajasekhar) హీరోగా నటించిన సినిమా 'శేఖర్'. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న ఫస్ట్ మూవీ ఇదే.
హీరోగా రాజశేఖర్(Rajasekhar) 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్(Jeevitha Rajasekhar) డైరెక్ట్ చేసిన ఈమూవీకి స్క్రీన్ ప్లే కూడా జీవితానే అందించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం కలిసి శేఖర్ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాలో తండ్రి రాజశేఖర్ (Rajasekhar) తో పాటు పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ కూడా స్క్రీన్ శేర్ చేసుకున్నారు. ఈసినిమాలో తండ్రీ కూతుర్ల పాత్రల్లోనే ఇద్దరూ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ..మూవీ టీమ్ మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఫోటోస్ ను రిలీజ్ చేశారు టీమ్.
ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో... సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ కు.. పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. అంతే కాదు ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు.
Also Read : NTR New Movie : ఎన్టీఆర్ సినిమాలో హీరో రాజశేఖర్.. ఏ పాత్ర చేయబోతున్నాడంటే..?
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న శేఖర్ సినిమా రిలీజ్ పై.. ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో సినిమా విడుదల తేదీ గురించి క్లారిటీ ఇస్తామన్నారు జీవిత. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ తో పాటుగా ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్ , రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటించిన. ఈ సినిమాకు మాటలు లక్ష్మీ భూపాల్ రాయగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
Also Read :Ram Gopal Varma: మరో సంచలన ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఏపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్