Dhanush : తమిళ హీరో ధనుష్ ‘సార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫిషియల్ అనౌన్స్ మెంట్

By team teluguFirst Published Sep 19, 2022, 11:51 AM IST
Highlights

తమిళ స్టార్ హీరో ధనుష్ ‘సార్’(Sir) చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ  ఇస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందగా.. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 

విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించడంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) ఎప్పుడూ ముందుంటారు. రోటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సౌత్ లో సత్తా చాటుతున్నారు. ఈక్రమంలో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ధనుష్ నటిస్తున్న తొలి చిత్రం `సార్‌`. ఈ మూవీ తెలుగు, తమిళంలో ఏక కాలంలో రూపుదిద్దుకుంటోంది. తెలుగులో ‘సార్’గా, తమిళంలో ‘వాతి’గా తెరకెక్కుతోంది. చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై,  సాయి సౌజన్య - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. మరోవైపు ధనుష్ కు కూడా తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ‘సార్’ చిత్రం రిలీజ్ డేట్ ను లాక్ చేస్తూ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 2న (2.12.2022) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రం తుది దశకు చేరుకుంది. త్వరలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లనున్నారు. 

ధనుష్‌కి జోడీగా `భీమ్లా నాయక్‌` ఫేమ్‌ సంయుక్త మీనన్‌ (Samyuktha Menon) నటిస్తోంది. ధనుష్‌ లెక్చరర్‌గా కనిపించనున్నారు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో కథ సాగనుంది. మరిన్ని ముఖ్య పాత్రల్లో సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ధనుష్ మరోచిత్రం ‘నేనే వస్తున్నాను’లోనూ నటిస్తున్నారు. చివరిగా ‘తిరుచిత్రంబలం’తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

 

Mark the Date. Our / is getting ready to take classes from 2nd Dec 2022! 📕🖊️✨ pic.twitter.com/mBvDl8b5cM

— Sithara Entertainments (@SitharaEnts)
click me!