#VT13:ఈ షార్ట్ ఫిల్మ్ చూసే వరుణ్ తేజ ఆఫర్

By Surya PrakashFirst Published Sep 19, 2022, 11:01 AM IST
Highlights

ఇంకా టైటిల్  పెట్టని ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా రాజస్థాన్‌కు చెందినవాడు. అతను టాలెంట్ ఉన్న దర్శకుడు. 


మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ 13వ సినిమా గురించి అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్స్ వచ్చేసింది. వరుణ్ తేజ్ స్వయంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా దీనికి సంబంధించి ఓ పోస్టర్ ని పోస్ట్ చేశారు. అందులో వరుణ్  వెనక్కి తిరిగి నిలబడి ఉన్నారు. ఈ మూవీ కథ ఏయిర్‌ఫోర్స్ నేపధ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.   దర్శకుడు, ప్రొడ్యూసర్ ఎవరో ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేసారు. ఇది తెలుగు, హిందీ బైలింగ్విల్ గా రూపొందే చిత్రం. 

Bravery that knows no bounds, celebrating the valour of
Indian Air Force.
Get ready to witness the battle in the skies on the big screen,
taking off soon! 🇮🇳 pic.twitter.com/QvSJL62DRf

— Varun Tej Konidela (@IAmVarunTej)

 ఇంకా టైటిల్  పెట్టని ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా రాజస్థాన్‌కు చెందినవాడు. అతను టాలెంట్ ఉన్న దర్శకుడు. గతంలో  ‘End Run’ అనే షార్ట్ ఫిల్మ్ తో చాలా పేరు తెచ్చుకున్నాడు.  VT13 నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడుతుంది . అలాగే ఈ సినిమా ఎయిర్‌ఫోర్స్ కథతో వస్తుంది. 

ఇది పాన్-ఇండియన్ స్థాయిలో రూపొందించబడి, అన్ని పాన్-ఇండియా భాషల్లో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది. Sony & Renaissance Pictures కలిసి ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు.  వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.  

 ఇక  గద్దలకొండ గణేష్ తర్వాత మెగా ప్రిన్స్ కు బాగా గ్యాప్ వచ్చింది. అది గనితో పూడుతుందనుకుంటే ఫలితం రివర్స్ అయ్యింది. వరుణ్ తేజ్ కష్టపడి  సిక్స్ ప్యాక్ ట్రై చేసి మరీ నటించిన గని డిజాస్టర్ కావడం వరుణ్ తేజ్ ని బాగా డిస్టర్బ్ చేసిందనే చెప్పాలి. ఇక ఎఫ్3 కమర్షియల్ గా బాగానే పే చేసినా ఆ సక్సెస్ షేర్ వెంకటేష్, అనిల్ రావిపూడితో పాటు ఇతర క్యాస్టింగ్ తో పంచుకోవాల్సి రావడంతో వరుణ్ కు ప్రత్యేకంగా మిగిలిందేమీ లేదు. కాకపోతే నత్తి క్యారెక్టర్ లో కామెడీని ఎఫ్2 కంటే బాగానే పండించాడనే పబ్లిక్ టాక్ వచ్చింది.
 

click me!