గుబురు గడ్డం, జుంపాలు, నల్ల కళ్లద్దాలు.. వైరల్ అవుతున్న ధనుష్ లుక్.. షాక్ లో ఫ్యాన్స్..

By Mahesh JujjuriFirst Published May 29, 2023, 7:08 PM IST
Highlights

ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో ధనుష్. అస్సలు ఎవరూ గుర్తు పట్టని విధంగా లుక్ ను మార్చేశాడు. ఎందుకు ధనుష్ ఇలా అయ్యాడు..?  

ధనుష్‌..  ప్రస్తుతం ప్యాన్‌ వరల్డ్‌ స్టార్‌. సినిమాలు, కథలు, దర్శకులు, హీరోయిన్లు.. లాంగ్వేజ్.. ఇలా ప్రతీ దాని విషయంలో ఆయనకు పట్టు ఉంది. అందుకే సినిమా చేయాలంటే పక్కాగా కొన్ని పాయింట్స్ ఆయన పాటిస్తాడు. ఇక ఆ సినిమా కోసం ఎంత కష్టం అయినా పడతాడు..  తన విలక్షణ.. నటనతో అన్ని భాషల్లో.. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులు దోచేశాడు ధనుష్. తమిళంలో కెరీర్ స్టార్ట్ చేసి.. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నాడు స్టార్ హీరో. ఇదివరకు ఏమో కాని..ఇప్పుడు  ఇండస్ట్రీ హద్దులు చెరిగిపోయాయి. అందులో ఇండియన్ స్టార్స్ అనిపించుకుంటున్నారు. ధనుష్ అందులో ముందు వరసలో నిలబడ్డాడు. 

ధనుష్ కు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటు తెలుగుమార్కేట్ ను కూడా పర్ఫెక్ట్ గా వాడేసుకుంటున్న ధనుష్..  కేవలం తమిళం, తెలుగులోనే కాదు.. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన  గ్రే మ్యాన్‌ అనే హాలీవుడ్  సినిమా తో తన ఇమేజ్ విశ్వ వ్యాప్తం చేసుకున్నాడు. ఇక త్వరలో ఈ గ్రే మ్యాన్ సీక్వెల్ లో కూడా థనుష్ నటించబోతున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే.. థనుష్ కు సడెన్ గా ఏమయ్యిందో ఏమో.. రూపురేఖలు మార్చేశాడు. 

ధనుష్‌కు సంబంధించిన న్యూ లుక్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆయన హీరో ధనుషా...లేక ఇంకా ఎవరైనానా అనుకునేలా.. పూర్తిగా మారిపోయి కనిపిస్తున్నాడు ధనుష్. . ఫొటోలు, వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాలో ప్రస్తుతం  వైరల్‌ అవుతున్నాయి.  మారాయి. ఆయన న్యూ లుక్‌ చాలా వెరైటీగా ఉంది. ధనుష్‌ జుట్టు, గడ్డం బాగా పెంచేశారు. ముఖం మొత్తం వాటి మధ్య కనిపించీ, కనిపించకుండా ఉంది. దానికి తోడు ఆయన నల్లటి కంటి అద్దాలు పెట్టుకుని ఉన్నారు.  

ఈ లుక్ లో ధనుష్ ను  గుర్తు పట్టడం చాలా కష్టమనే చెప్పాలి.  ఈ న్యూ లుక్‌ సినిమా కోసమా? లేక దైవ చింతనలో ఉన్నా రా అని ధనుష్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతే కాదు ఈసినిమాలో మన తెలుగు యంగ్ స్టార్ సందీప్ కిషన్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. మరి ధనుషక ఆలుక్ ఎందుకు మెయింటేన్ చేస్తున్నారో ఏమో.. తెలియాల్సి ఉంది...? 
 

click me!