కొద్ది రోజుల్లో మూవీ రిలీజ్, ఐసీయూలో డైరక్టర్

By Surya PrakashFirst Published Mar 14, 2021, 10:49 AM IST
Highlights

 మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అంటే ఓ ఉద్వేగం, ఉత్సాహం మామూలుగా ఉండదు. కానీ ఇప్పుడా టీమ్ కు అదేమీలేదు. తమ డైరక్టర్ ప్రాణాపాయం నుంచి బయిటపడితే చాలు అనుకుంటున్నారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. ఇప్పుడు తమిళ సిని పరిశ్రమలో ఇదే హాపిక్. ట్విట్టర్ లో ఆయన కోలుకోవాలని ప్రార్ధనలతో ట్వీట్స్. ఎందుకంటే ఆయన మామూలు డైరక్టర్ కాదు. జాతీయ అవార్డ్ గెలుగుచుకున్న డైరక్టర్. ఆయనే జననాథన్.

వివరాల్లోకి వెళితే...ఉప్పెన విలన్  విజయ్ సేతుపతి అప్‌కమింగ్ ఫిల్మ్ ‘లాభం’. ఆ చిత్రం దర్శకుడు జననాథన్  పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత కాలంగా చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఉన్నట్లుంది ఇంట్లోనే స్పృహ తప్పి కింద పడిపోయిన జననాధన్‌ను తన అసిస్టెంట్స్ హాస్పిటల్‌కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తనకు ఇంకా మెడికల్ టెస్టులు జరుగుతున్నాయని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం పరిస్దితి సీరియస్ గా ఉన్నట్లు తమిళ మీడియా చెప్తోంది.

ఇక జననాథన్ జాతీయ అవార్డు విన్నింగ్ డైరక్టర్. 2003లో ఆయన సినిమా ‘ఇయర్కై’ ఆ సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది. 61 సంవత్సరాల జననాథన్ ఇప్పటిదాకా తమిళంలో నాలుగు సినిమాలు రూపొందించాడు. లాభంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. శ్రుతి హాసన్ హీరోయిన్. జగపతిబాబు విలన్ పాత్రలో నటించాడు. వ్యవసాయంలో దళారుల దందా నేపథ్యంలో నడిచే కథ ఇది.  ఈ చిత్రాన్ని విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్, 7సీఎస్ఎంటర్‌టైనర్‌మెంట్ ప్రై.లి. బ్యానర్స్ నిర్మిస్తున్నాయి.

click me!