సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ ‘క్రాక్’ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలుసు. అయితే నిర్మాత ‘ఠాగూర్’ మధు ఆర్థిక వివాదంలో ఇరుకున్న కారణంగా రిలీజ్ రోజు ఉదయం నుండి ఎక్కడా థియేటర్లలో షోలు పడలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్, ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అవగా సాయంత్రం ఫస్ట్ షో నుండి షోలు పడ్డాయి. అసలు సినిమా సకాలంలో విడుదల కాకపోవడానికి కారణం ఏంటి అంటే నిర్మాత గతంలో పెండిగ్ పెట్టుకున్న ఫైనాన్సియల్ సెటిల్మెంట్. రవితేజ సినిమా రిలీజ్ ఆగటం అనేది తొలిసారి.

అలాంటి సమస్య తమ సినిమాల విషయంలోనూ రిపీట్ కాకూడదని ఇప్పుడు పెద్ద హీరోలంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా బాలయ్య నిర్మాత సైతం ఓ ఆర్దిక వివాదంలో ఇరుక్కోవటంతో ...అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. దాంతో ఈ సినిమా విడుదలకు ముందే ఏ సమస్యలున్నా…. అవన్నీ క్లియర్ చేసుకోవాలని బాలయ్య నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డికి అల్టిమేటం ఇచ్చాడట. లేదంటే తీరా విడుదల రోజు సినిమాకి క్లియరెన్స్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారట.
ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాను నిర్మిస్తున్న మిరియాల రవీందర్ రెడ్డి ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. దీంతో ఆయనకు ప్రత్తిపాడులోని మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2016లో నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా హక్కుల విషయంలో ఓ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి 50 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు.
అయితే.. సినిమా రైట్స్ ను అతనికి కాకుండా మరో డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చారనేది వాదన. దీనిపై కోర్టులో కేసు వేసాడు ఆ యూఎస్ డిస్ట్రిబ్యూటర్. తీసుకున్న అడ్వాన్సు ఇవ్వకపోగా 10లక్షలు మాత్రమే ఇస్తానంటూ రవీందర్ రెడ్డి అంటున్నాడని యూఎస్ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకు విన్నవించాడు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. రిలీజ్ లోపల క్లియర్ చేసుకోవాలి మరి.