
వెండి తెరపై ఎంతో మంది స్టార్ హీరోలు వెలుగు వెలిగారు. ఈమధ్య బుల్లి తెరపై కూడా హోస్ట్ లు గా దుమ్ము రేపారు. ఎన్నో షోలను సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. ఇక ఆలిస్ట్ లోకి మరో స్టార్ హరో కూడా వచ్చి చేరుతున్నారు.
సౌత్ నార్త్.. అన్ని భాషల్లో స్టార్ హీరోలు బుల్లి తెరపై సందడి చేశారు షో ఏదైనా.. తమదైన శైలితో రేటింగ్స్ ను పరుగులు పెట్టించారు. టాలీవుడ్ లో నాగార్జున, చిరంజీవి, బాలయ్య, ఎన్టీఆర్, నానీ, రానా, సాయి కుమార్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్టార్స్ స్మాల్ స్క్రీన్ కు కొత్త రూపు దిద్దారు. బుల్లి తెర విలవలను పెంచారు. అటు తమిళ్ లో కమల్ హాసన్. కన్నడ లో పునిత్, సుధీప్, మలయాళంలో మోహన్ లాల్ లాంటి స్టార్స్ బుల్లి తెరపై సందడి చేశారు. ఇక ఇఫ్పుడు మరో స్టార్ హరో బుల్లి తెర ఎంట్రీ ఇస్తున్నారు.
ఇండియాలో దాదాపు అన్ని పాపులర్ లాంగ్వేజెస్ లో బిగ్ బాస్ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగు తమిళ భాషల్లో ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో సూపర్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. అయితే తెలుగులో ఎన్టీఆర్ స్టార్ట్ చేసి.. నానీ ఓ ఎపిసోడ్ చేసి.. నాగార్జునకు అప్పగించగా.. ఆయన గత మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. అటు తమిళ్ లో లోకనాయకుడు కమల్ హాసన్ 5 సీజన్లను ఆయనే విజయ వంతంగా నడిపించారు.
ఇక ఇఫ్పుడు బిగ్ బాస్ 24 గంటలు అలరించడానికి రెడీ అవుతుంది. దీని కోసం డిస్నీ హాట్ స్టార్ లో కొత్త గా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతోంది. ఈ షోను తెలుగులో నాగార్జునానే హోస్ట్ చేస్తుండగా.. దీనికి సంబంధించిన ప్రోమోస్ రిలీజ్ అయిపోయాయి. నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. కాని అటు తమిళ్ లో మాత్రం బిగ్ బాస్ హోస్ట గా కమల్ తప్పుకున్నారు. సినిమా షూటింగ్స్ అన్నీ ఒకేసారి రావడంతో ఈ షో చేయడం కుదరదని చెప్పారట కమల్. దాంతో కొత్త హోస్ట్ గా స్టార్ హీరోను రంగంలోకి దింపింది హాస్ట్ స్టార్.
తమిళ నాట వివాదాస్పద నటుడు.. డైనమిక్ హీరో శింబు బిగ్ బాస్ ఓటీటీ ఎపిసోడ్స్ కు హోస్టింగ్ చేయబోతున్నాడు. రీసెంట్ గా మానాడు సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి జోష్ మీద ఉన్న శింబు.. బిగ్ బాస్ హోస్ట్ గా సందడి చేయబోతున్నాడు. దీనికి సబంధించిన ప్రోమోను కూడా డిస్నీ హాట్ స్టార్ తమిళ్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఎపిసోడ్స్ అద్భఉతంగా వస్తే.. మెయిన్ బిగ్ బాస్ కూడా శింబునే హ్యాండిల్ చేసే అవకాశం ఉంది.
బిగ్ బాస్ అంటేనే వివాదాలు.. నవరసాలు.. రకరకాల మనుషులు..గోడవలు.. ప్రేమలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ సమపాళ్ళలో కలుపుకుని..జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి హోస్ట్. మరి శింబు అంటేనే హైపర్ యాక్టీవ్.. వివాదాలతో ఆటలు ఆడుతుంటాడు. మరి ఈ స్టార్ యంగ్ డైనమిక్ హీరో బిగ్ బాస్ ను ఎలా రన్ చేస్తాడో చూడాలి.