సత్యదేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్..నిజమే అన్న డైరక్టర్

Surya Prakash   | Asianet News
Published : Mar 25, 2021, 12:27 PM IST
సత్యదేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్..నిజమే అన్న డైరక్టర్

సారాంశం

పవన్ కళ్యాణ్ త్వరలో సత్యదేవ్ పాత్రలో కనిపించి దుమ్ము రేపనున్నారు. ఈ మేరకు డైరక్టర్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇంతకీ ఏ సినిమాలో ఆయన పాత్ర పేరు అది అంటారా..మరేదో కాదు..వకీల్ సాబ్...పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్’‌. ఈ సినిమాను శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. దాదాపు మూడేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల చిత్రానికి సంబంధించిన  ప్రమోషన్‌ కార్యక్రమంలో దర్శకుడు వేణు శ్రీరామ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  

వేణు శ్రీరామ్ మాట్లాడుతూ...హిందీలో వచ్చిన పింక్ మూలం మాత్రం అలాగే ఉందని ఆత్మను కొనసాగిస్తూనే.. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథను అల్లుకున్నట్టు చెప్పారు. ముగ్గురు మహిళల కోణం నుంచి మొదలై.. పవన్ సెంటర్ స్టేజ్ తీసుకునేలా చిత్రం సాగుతుందని అన్నారు. అయితే.. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పేరు వకీల్ సాబ్ కాదని చెప్పారు దర్శకుడు. ఆయన క్యారెక్టర్ యాక్చువల్ పేరు ‘సత్యదేవ్’ అనీ.. అయితే పక్కన ఉన్నవాళ్లు మాత్రం వకీల్ సాబ్ అని పిలుస్తుంటారని తెలిపారు. అయితే.. వకీల్ సాబ్ అని ఎందుకు పిలవాల్సి వస్తుందో సినిమా చూశాక అర్థమవుతుందని అన్నారు. 

అలాగే వకీల్ సాబ్ సినిమాకు  పవన్ కళ్యాణ్ గారు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఇక సినిమా పూర్తయ్యాక చూసి వకీల్ సాబ్ విషయంలో ఆనందంగా ఉన్నారు. నిజానికి హీరోగా పవన్ కళ్యాణ్ అనే బిగ్ స్టార్ ఉన్నాడు కాబట్టి నాకు అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. కానీ నేను అన్నివిధాలా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ముగ్గురు ఆడపిల్లల నేపథ్యం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు.మార్చ్ 29న  ఈ సినిమా  ట్రైలర్ విడుదల కాబోతుంది.
 
PREV
click me!

Recommended Stories

Simran To Rambha: సిమ్రాన్ నుంచి రంభ వరకు..సీనియర్ హీరోయిన్లు ఐటెం సాంగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా
Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇంట్లో నుంచి గెంటేస్తానన్న సుమిత్ర-శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్