జ్వాలా గుత్తాతో విడాకులంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన తమిళ హీరో

By Asianet News  |  First Published Mar 27, 2023, 5:10 PM IST

తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్టు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇందుకు కారణం కూడా తను చేసి ట్వీటే. దీంతో తానే స్వయంగా క్లారిటీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. 
 


కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్టుగా కొద్దిరోజులగా నెట్టింట తెగ ప్రచారం జరిగింది. భార్య బాడ్మింటన్ జ్వాల గుత్తాకు విష్ణు విశాల్ డివోర్స్ ఇస్తున్నారే విషయం హాట్ టాపిక్ గ్గా మారింది. దీనికి కూడా ఆయన చేసిన  ట్వీటే కారణంగా తెలుస్తోంది.  కొద్ది రోజుల కింద విష్ణు విశాల్ ఇలా ట్వీట్ చేశారు. ‘నేను చాలా ప్రయత్నించాను. అయినా ఫెయిల్ అవుతూనే ఉన్నాను. కానీ దాన్నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటున్నాను. అయినా ఫెల్యూర్ కాదు పూర్తిగా నా తప్పే! అదోక మోసపూరిత ద్రోహం‘ అంటూ పేర్కొన్నారు. దీనికి లైఫ్ లెస్సన్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. 

కట్ చేస్తే.. కొద్దిరోజులకు విష్ణు విశాల్ తన భార్య జ్వాల గుత్తాకు విడాకులు ఇవ్వబోతున్నారని, విష్ణు, జ్వాలకు ఏదో జరిగిందని రూమర్లు స్రెండ్ అయ్యాయి. రూమర్లు అలా పాకుతూ విష్ణు విశాల్ వరకూ వెళ్లాయి. దీంతో వెంటనే స్పందిస్తూ డివోర్స్ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా విష్ణు మరో ట్వీట్ చేసి పుకార్లకు అడ్డుకట్ట వేశారు. అసలేం జరిగిందో చెప్పుకొచ్చారు.

Latest Videos

ట్వీట్ చేస్తూ.. కొద్దిరోజుల కింద నేను నేసి ట్వీట్ ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడింది నా పర్సనల్ లైఫ్ గురించి అస్సలు కాదు. కేవలం ప్రొఫెషనల్ లైఫ్ గురించే ట్వీట్ చేశాను. మా ఇద్దరికి ఒకరిపై మరొకరికి చాలా నమ్మకం, ప్రేమ ఉన్నాయి.‘ అంటూ క్లారిటీ ఇచ్చారు. చివరిగా మాస్ మహారాజ నిర్మాత విడుదల చేసిన ‘మట్టి కుస్తీ’ చిత్రంలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలసిందే. ప్రస్తుతం ఐశ్వర్య రజినీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో నటిస్తున్నారు. 

 

Hey all
My tweeet few days back has been terribly misinterpreted..
It was on proffessional front n not personal at all..
The biggest gift that we give someone is TRUST
And when we fail we always blame ourselves..
We shudn be hard on ourselves
THATS ALL I MEANT
ALL IS WELL

— VISHNU VISHAL (VV) (@TheVishnuVishal)
click me!