#DEVARA ఇన్సైడ్ ఇన్ఫో: ఎప్పటికి పూర్తి,ఎంత పెండింగ్

Published : Dec 15, 2023, 10:16 AM IST
#DEVARA ఇన్సైడ్ ఇన్ఫో: ఎప్పటికి పూర్తి,ఎంత పెండింగ్

సారాంశం

VFX వర్క్ ఎక్కువ ఉండటంతో దేశంలోని టాప్ గ్రాఫిక్స్ కంపెనీలు పీస్ వర్కులుగా ఈ వర్క్ చేస్తున్నాయి. ఇక త్వరలోనే యాక్షన్ ప్యాకెడ్ స్పెషల్ టీజర్ వదులబోతున్నారు. 


 ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్కంగా  తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’ (Devara). ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్  నెలకొన్నాయి. పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రెండు భాగాల్లో ఇది రానుంది. ఇందులో తారక్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ నటిస్తుండగా.. విలన్ పాత్రలో సైఫ్‌ అలీఖాన్ (Saif Ali Khan) కనిపించనున్నారు.  రీసెంట్ గా   హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించి టీమ్ రెస్ట్ మోడ్ లో ఉంది.  సముద్రతీరం నేపథ్యంలో.. భయం అనే అంశం ప్రధానంగా సాగే చిత్రమిది. దీని మొదటి భాగం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో..ఆ షెడ్యూల్ డిటేల్స్ చూస్తే...

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం జనవరి 2024న షూటింగ్ పూర్తవుతుంది.  కొన్ని సీన్స్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని చెప్తున్నారు. ఎన్టీఆర్ పోర్షన్ కూడా పూర్తైందని వినికిడి. అయితే అసలైన పని ఇప్పుడే ఉందని,  CG వర్క్ పూర్తి చేయాల్సి ఉందని అంటున్నారు. త్వరలోనే  CG పూర్తి చేసి అవుట్ ఫుట్ చూసుకుని ఏమైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేస్తారట. VFX వర్క్ ఎక్కువ ఉండటంతో దేశంలోని టాప్ గ్రాఫిక్స్ కంపెనీలు పీస్ వర్కులుగా ఈ వర్క్ చేస్తున్నాయి. ఇక త్వరలోనే యాక్షన్ ప్యాకెడ్ స్పెషల్ టీజర్ వదులబోతున్నారు. ఆ టీజర్ తో  బిజినెస్ ఫినిష్ చేయాలనే ప్లానింగ్ అంటున్నారు. మ్యూజిక్ డైరక్టర్ అనిరిధ్ ఇప్పటికే నాలుగు ట్యూన్స్ రెడీ చేసారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో తండ్రి,కొడుకులగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆంద్రలోని నిర్లక్ష్యం చేయబడ్డ సముద్ర తీర ప్రాంతాల గురించి ఉంటుంది. దాంతో సినిమాలో ఎక్కువ భాగం సముద్రం కనిపిస్తుంది. 

ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ పెద్ద  షెడ్యూల్ ఆ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో చేసారు. సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కించాడు కొరటాల శివ. ఈ ఇద్దరి మధ్య కుస్తీ పోటీలని, అంతక ముందు జాతర సెటప్ లోని కొన్ని సీన్స్ ని షూట్ చేశారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ భైరవుడు అనే పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ‘దేవర’గా కనిపించనున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఫర్గాటెన్ లాండ్స్ లో, క్రూర మృగాలకి కూడా భయపడని మనుషులు ఉంటారు. జాలి అనేదే లేని ఆ మృగాల్లాంటి మనుషులని భయపెట్టేది ఒకరే, అతనే  ఎన్టీఆర్ అంటూ కొరటాల శివ ‘ఎన్టీఆర్ 30’ అనౌన్స్మెంట్ రోజునే అంచనాలు పెంచేసాడు.  ఈ సినిమాకి నిర్మాత ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , కొసరాజు హరికృష్ణ (Kosaraju Harikrishna) లు.

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్