Tamannah: అరటి ఆకులో భోజనం చేస్తున్న తమన్నా... స్పందించిన సమంత!

Published : Nov 25, 2021, 08:02 AM ISTUpdated : Nov 25, 2021, 08:04 AM IST
Tamannah: అరటి ఆకులో భోజనం చేస్తున్న తమన్నా... స్పందించిన సమంత!

సారాంశం

మిల్కీ బ్యూటీ తమన్నా జోరు మాములుగా లేదు. చేతినిండా సినిమాలతో బిజీ కెరీర్ లీడ్ చేస్తున్నారు. కాగా తమన్నా తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. 

తమన్నా(Tamannah) చిత్ర పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినా ఆమెకు ఆఫర్స్ వెల్లువ తగ్గలేదు. టాలీవుడ్ లో లాంగ్ కెరీర్ కలిగి ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా తమన్నా నిలిచారు. ఈ మధ్య కాలంలో కాజల్ తర్వాత తమన్నానే ఆ రేంజ్ పాపులారిటీ దక్కించుకున్నారు. కుర్ర హీరోలు తమన్నాను పక్కన పెట్టినా... సీనియర్ స్టార్ హీరోల ఛాయిస్ గా మారిపోయారు. వెంకటేష్, చిరంజీవి వంటి స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంటున్నారు. 


వెంకటేష్ (Venkatesh) కి జంటగా ఎఫ్ 3 చిత్రంలో తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2కి ఇది సీక్వెల్. ఎఫ్ 2లో జతకట్టిన ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. ఇక చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో హీరోయిన్ గా మరో క్రేజీ ఆఫర్ పట్టేసింది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. 


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో తమన్నాకు ఇది రెండవ చిత్రం. గతంలో పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి మూవీలో ఆయన ప్రేయసి రోల్ చేశారు తమన్నా.  తమిళ్, హిందీ చిత్రాలతో పాటు సత్య దేవ్ కి జంటగా 'గుర్తుందా శీతాకాలం' మూవీ చేస్తున్నారు. తమన్నాతో పాటు పరిశ్రమకు వచ్చిన హీరోయిన్స్ ఫేడ్ అవుట్ కాగా.. ఆమె మాత్రం వరుస ఆఫర్స్ తో సత్తా చాటుతున్నారు. 

Also read Samantha: మరోసారి సమంతపై ట్రోలింగ్.. చైతు గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు ఫైర్
తాజాగా తమన్నా షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవత గెటప్ లో ఉన్న తమన్నా.. అరటి ఆకులో భోజనం చేస్తున్నారు. ఓ షూటింగ్ సందర్భంగా సెట్స్ లో అరటి ఆకులో, వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు. అరటి ఆకులో భోజనం చేయడం, గొప్ప అనుభూతిని కలిగించిందని తమన్నా తన ఫీలింగ్ పంచుకున్నారు. ఇక తమన్నా షేర్ చేసిన ఈ ఫోటోపై సెలెబ్రిటీలు స్పందించారు. సమంత (Samantha) లవ్ సింబల్ ని కామెంట్ గా పెట్టడం జరిగింది.

 

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ