Bigg Boss Telugu5: తీవ్ర వేదనతో చెంపలు వాయించుకున్న పింకీ.. హౌస్ లో కమ్యూనిటీ గొడవ

pratap reddy   | Asianet News
Published : Nov 24, 2021, 11:51 PM ISTUpdated : Nov 25, 2021, 07:12 AM IST
Bigg Boss Telugu5: తీవ్ర వేదనతో చెంపలు వాయించుకున్న పింకీ.. హౌస్ లో కమ్యూనిటీ గొడవ

సారాంశం

బిగ్ బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) షో నెమ్మదిగా తుది దశకు చేరుకుంటోంది. దీనితో హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. నేటి ఎపిసోడ్ గోల్ పోస్ట్ లోకి బాల్స్ ని కొట్టే గేమ్ తో మొదలయింది. 

బిగ్ బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) షో నెమ్మదిగా తుది దశకు చేరుకుంటోంది. దీనితో హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. నేటి ఎపిసోడ్ గోల్ పోస్ట్ లోకి బాల్స్ ని కొట్టే గేమ్ తో మొదలయింది. ఇక కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా సీట్ దక్కించుకున్న వారు మిగిలిన వారిలో ఒకరిని సేవ్ చేయాలి. మొదటగా సీట్ లో కూర్చుకునే అవకాశం నేడు పింకీకి దక్కుతుంది. దీనితో రవి, సిరి లలో పింకీ రవిని సేవ్ చేస్తుంది. దీనితో సిరి గేమ్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. 

ఆ తర్వాత హౌస్ లో పరిస్థితులు హీటెక్కుతాయి. ఈసారి Shanmukh సీట్ దక్కించుకుంటాడు. దీనితో షణ్ముఖ్ రవి, పింకీ లలో ఒకరిని సేవ్ చేయాల్సి వస్తుంది. పింకీ తనని సేవ్ చేయాలని షణ్ముఖ్ ని చాలా ప్రాధేయ పడుతుంది. కెప్టెన్ అయ్యేందుకు నాకు ఇదే చివరి అవకాశం. మరో ఛాన్స్ ఉంటే నేను ఇలా అడిగేదాన్ని కాదు. దయచేసి నన్ను సేవ్ చేయాలని పింకీ షణ్ముఖ్ ని రిక్వస్ట్ చేస్తుంది. తాను కెప్టెన్ అయితే తన ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి నమ్మకం కలిగించినదాన్ని అవుతానని చెబుతుంది. 

పింకీ వాదనకు Kajal నుంచి సపోర్ట్ లభిస్తుంది. కానీ షణ్ముఖ్ కి ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ గురించి ప్రస్తావించడం నచ్చదు. దీనితో షణ్ముఖ్ కాజల్, పింకీ పై ఫైర్ అవుతాడు. తీవ్ర వేదనకు గురైన పింకీ గేమ్ నుంచి వెళ్ళిపోతూ చెంపలు వాయించుకుని ఏడుస్తుంది. షణ్ముఖ్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ రవిని సేవ్ చేస్తాడు. దీనితో పింకీ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోతుంది. వాష్ రూమ్స్ వద్దకు వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మానస్, సన్నీ.. పింకీని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. 

చివరికి కెప్టెన్సీ రేసులో రవి, షణ్ముఖ్ మిగులుతారు. ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్ గా ఎంపిక అవుతాడు. షణ్ముఖ్ కి ఐదు ఓట్లు, రవికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుంది. షణ్ముఖ్ కెప్టెన్ అయ్యాక హౌస్ లో సందడి వాతావరణం నెలకొంటుంది. దీనితో బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సరదాగా గేమ్ లు ఆడతారు. కాసేపు ఫ్రీజ్, రిలాక్స్ గేమ్ సాగుతుంది. 

దీనితో ఫ్రీజ్ అయిన వారిని మిగిలిన సభ్యులు ఆటపట్టించే ప్రయత్నం చేస్తారు. షణ్ముఖ్ ఫ్రీజ్ అయ్యాక సిరి అతడిని కౌగిలించుకుంటుంది. దీనితో ఇంటి సభ్యులు వారిద్దరితో రొమాంటిక్ వేషాలు వేయిస్తారు. ఇంతలో హౌస్ లోకి కాజల్ ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. దీనితో కాజల్ ఎమోషల్ అవుతుంది. కాజల్ కుమార్తె, భర్త ఇద్దరూ హౌస్ లోకి వస్తారు. 

కాజల్ భర్త హౌస్ లో ఉన్న ఒక్కో సభ్యుడి గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారో సరదాగా చెబుతారు. సరదా ముచ్చట్లు ముగిశాక కాజల్ భర్త, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళతారు. ఇంటి సభ్యులు వారికీ సెండాఫ్ ఇస్తారు. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో మిగిలిన ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు హౌస్ లోకి రానున్నారు. 

Also Read: Shiva Shankar master:షాకింగ్.. శివశంకర్ మాస్టర్ పరిస్థితి విషమం, వెంటిలేటర్ పై చికిత్స

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్