మళ్లీ వాయిదా.. గోపీచంద్ ఆక్సిజన్ కొత్త రిలీజ్ తేది అక్టోబర్ 27

Published : Sep 22, 2017, 03:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
మళ్లీ వాయిదా.. గోపీచంద్ ఆక్సిజన్ కొత్త రిలీజ్ తేది అక్టోబర్ 27

సారాంశం

గోపీచంద్ తదుపరి చిత్రం 'ఆక్సిజన్' ఇప్పటికే పలుమార్లు వాయిదా తాజాగా మళ్లీ రిలీజ్ డేట్ మార్చేసి అక్టోబర్ 27న అంటూ ప్రకటన  కథానాయికలుగా రాశి ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్       

గోపీచంద్ హీరోగా జ్యోతికృష్ణ  దర్శకత్వంలో 'ఆక్సిజన్' చిత్రం తెరకెక్కింది. ఐశ్వర్య నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 'గౌతమ్ నందా' కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది.
 

అక్టోబర్ 12 న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా చెప్పారు .. ఆ తరువాత అక్టోబర్ 17కి వెళ్లారు. ఇక ఇప్పుడు అక్టోబర్ 27ను విడుదల తేదీగా ఫిక్స్ చేశారనేది తాజా సమాచారం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులంతా కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీలను పదే పదే మారుస్తూ ఉండటమే వాళ్లకి అసహనాన్ని కలిగిస్తోంది. ఇలా విడుదల తేదీలను పదేపదే మార్చడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్
Sudha Kongara: పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర నెక్స్ట్ మూవీ.. స్టార్ హీరో కొడుకుతో భారీ ప్లాన్ ?