చిరు సర్ నా గురించి ఆలోచించండి.. తమన్నా కామెంట్స్!

Published : Oct 03, 2019, 02:13 PM IST
చిరు సర్ నా గురించి ఆలోచించండి.. తమన్నా కామెంట్స్!

సారాంశం

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ చిత్రాన్నిదేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం  చేయడంపై చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టింది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదల చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ చిత్రాన్నిదేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేయడంపై చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన తమన్నా తన మాటలతో ఆకట్టుకుంది. చిరంజీవి గారితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పిన తమన్నా భవిష్యత్తులో అతడితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

ఈ క్రమంలో చిరుని పిలిచి తన గురించి ఆలోచించాలని.. ఫ్యూచర్ లో మరిన్ని అవకాశాలు ఇప్పించాలని కోరింది. 'సైరా' లో తన పాత్రకు మంచి పేరు వస్తుందని, ఇప్పటివరకు చేసిన సినిమాల్లో 'సైరా' తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోతుందని.. ఇప్పుడు అందరూ తనను లక్ష్మీ నరసింహారెడ్డి అని పిలుస్తున్నట్లు చెప్పింది. 
 
PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..