హిజ్రా గెటప్ లో అక్షయ్ కుమార్.. షాకింగ్ లుక్

Published : Oct 03, 2019, 01:49 PM IST
హిజ్రా గెటప్ లో అక్షయ్ కుమార్.. షాకింగ్ లుక్

సారాంశం

అక్షయ్ కుమార్ మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు. గ్యాప్ లేకుండా నిరంతరం ఎదో ఒక ప్రయోగంతో ఆడియెన్స్ ని ఆకట్టుకునే అక్షయ్ ఈ సారి సౌత్ ఇండియన్ రీమేక్ తో రచ్చ చేయనున్నాడు. కోలీవుడ్ సూపర్ హైర్ మూవీ కాంచన సౌత్ లో బాక్స్ ఆఫీస్ గా నిలిచింది. 

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో అక్షయ్ కుమార్ మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు. గ్యాప్ లేకుండా నిరంతరం ఎదో ఒక ప్రయోగంతో ఆడియెన్స్ ని ఆకట్టుకునే అక్షయ్ ఈ సారి సౌత్ ఇండియన్ రీమేక్ తో రచ్చ చేయనున్నాడు. కోలీవుడ్ సూపర్ హైర్ మూవీ కాంచన సౌత్ లో బాక్స్ ఆఫీస్ గా నిలిచింది.  

ఆ హారర్ సినిమాను అక్షయ్ హిందీలో లక్ష్మి బాంబ్ గా రీమేక్ చేస్తున్నాడు. కథ ఒరిజినల్ దర్శకుడు లారెన్స్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సినిమాలో కాంచన పాత్రలో కనిపించబోయే అక్షయ్ లుక్ ని విడుదల చేశారు. హిజ్రాగా అక్షయ్ చీరలో చాలా బావున్నాడని నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. నార్త్ ఆడియెన్స్ కి తగ్గట్టుగా సినిమా మేకింగ్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.  

కానీ పాత్రల విషయంలో లారెన్స్ చేంజెస్ కోరుకోవడం లేదట. సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ లో అంచనాల డోస్ పెరిగింది. ఇక నెక్స్ట్ టీజర్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాతో అక్షయ్ కుమార్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?