మెగాస్టార్ కి చరణ్ సరైన గిఫ్ట్ ఇచ్చాడు.. రాఘవేంద్రరావు కామెంట్స్!

Published : Oct 03, 2019, 01:50 PM IST
మెగాస్టార్ కి చరణ్ సరైన గిఫ్ట్ ఇచ్చాడు.. రాఘవేంద్రరావు కామెంట్స్!

సారాంశం

సైరా సినిమా నిన్న రిలీజ్ అయ్యి అన్ని వర్గాల నుండి కూడా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మీద ఏర్పడిన హైప్‌తో మొదటిరోజే చాలా మంది సెలబ్రిటీ‌లు కూడా ఈ సినిమా చూసారు.   

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది.సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాజమౌళితో సహా చాలా మంది సెలబ్రిటీలు మొదటిరోజే ఈ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో తనకు తెలిసిన చిరంజీవిగాకాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగానే కనిపించాడని అన్నారు.

మెగాస్టార్ అధ్బుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని.. సైరా టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు. 'సైరా' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని రాఘవేంద్రరావు కితాబిచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కష్టం సినిమాలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని.. ప్రీక్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో తమన్నా అధ్బుతంగా నటించిందని అన్నారు. నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్ ఈ చారిత్రాత్మక చిత్రంతో తండ్రికి సరైన గిఫ్ట్ ఇచ్చారని రాఘవేంద్రరావు అన్నారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?