విరాట్ కొహ్లీతో డేటింగ్ పై తమన్నా కామెంట్స్!

Published : Mar 01, 2019, 02:13 PM IST
విరాట్ కొహ్లీతో డేటింగ్ పై తమన్నా కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్ లలో కూడా కనిపిస్తుంటుంది. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్ లలో కూడా కనిపిస్తుంటుంది. వ్యక్తిగతంగా తమన్నా కొన్ని రూమర్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

హీరోయిన్లు అంటే రూమర్లు కామనే.. అయితే తమన్నాకి ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఎఫైర్ అనే వార్తలు రావడంతో అప్పట్లో ఆ న్యూస్ బాగా చక్కర్లు కొట్టింది. 2012లో వీరిద్దరూ కలిసి ఓ యాడ్ లో నటించారు.

అప్పటినుండి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తమన్నా, విరాట్ లు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు విరాట్ కి పెళ్లి కూడా అయిపోయింది. ఇలాంటి నేపధ్యంలో ఓ షోలో తమన్నాకి విరాట్ తో ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

దీనికి తమన్నా బదులిస్తూ.. యాడ్ లో నటించిన తరువాత విరాట్ ని ఒక్కసారి కూడా కలవలేదని చెప్పింది. షూటింగ్ సమయంలో కూడా ఇద్దరి మధ్య ప్రొఫెషన్ కి సంబంధించి మాటలే నడిచాయని చెప్పింది. ప్రస్తుతం తమన్నా 'క్వీన్' తెలుగు రీమేక్ 'That is మహాలక్ష్మి' సినిమాలో నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు