
ఇతర భాషల్లో హిట్ గా నిలిచిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేయడం సహజమే. ఆ కోవలోనే... బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్ రీమేక్ కోసం చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ నటుడు నిర్మాత త్యాగరాజన్, క్వీన్ రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా.. ప్రధాన పాత్రల్లో కనిపించబోయే నటీనటుల కోసం చాలా కాలం కసరత్తులు చేశాడు. చివరగా తమన్నా హీరోయిన్ గా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సడన్ గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రకటన వచ్చింది.
క్వీన్ రీమేక్ ఆగిపోవడానికి కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత త్యాగరాజన్ అసలు కారణాన్ని బయటపెట్టాడు. తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపాడు. ప్రస్తుతానికి క్వీన్ రీమేక్ పక్కకు పెట్టినా.. సరైన నటి దొరికితే తిరిగి ప్రారంభిస్తానని స్పష్టం చేశాడు. మరి తమన్నాకు డబ్బుల్లేవా.. ఇలాంటి ప్రాజెక్ట్ వదులుకోకుండా.. అతిగా డిమాండ్ చేయకుండా ఉంటే బాగుండేది కదా..