
టాలీవుడ్ హీరోయిన్, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా నార్త్ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతోంది. ఇప్పటికే పలు హిందీ మూవీల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా మ్యూజిక్ వీడియోస్ లోనూ నటిస్తోంది. 2005లో ఒక మ్యూజిక్ వీడియోలో నటించగా.. తాజాగా మరో మీడియోతో వచ్చింది. గతంలో సింగర్ అబిజీత్ సావంత్ (Abhijeet Sawant)తో కలిసి నటించింది. ‘ఆప్కా.. అబిజీత్ సావంత్’ ఆల్బమ్స్ నుంచి ‘లాఫ్జోన్ మెయిన్’ మ్యూజిక్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఏడేండ్ల తర్వాత తాజాగా మరో క్రేజీ సాంగ్ తో ఆడియెన్స్ అలరిస్తోంది తమన్నా. తబహీ (Tabahi) సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. సింగర్ బాద్షా (Badshah)తో కలిసి నటించింది.
ఈ సాంగ్ కు హితేన్ ట్రెండీ మ్యూజిక్ ను అందించారు. ‘రెట్రో పాండ’ ఆల్బమ్స్ నుంచి పార్ట్-1గా ‘తబహీ’ మ్యూజిక్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. వీడియో సాంగ్ లో తమన్నా మరింత గ్లామర్ స్టెప్పులు వేసింది. విజువల్స్ , డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. గతేడాది బాద్షాతో కలిసి టాప్ టక్కర్ (Top Tucker) మ్యూజిక్ వీడియో సాంగ్ లో రష్మిక మండన్న (Rashmika Mandanna) నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘జెండా పూల్’ (Genda Pool)లో ఆడిపాడారు.
తమన్నా తెలుగులోనూ స్పెషల్ సాంగ్స్ చేసేందుకు ప్రయారిటీ ఇస్తోంది. అల్లుడు శ్రీను మూవీతో తొలిసారిగా ఐటెం సాంగ్ లో నటించారు తమన్నా.. ఆ తర్వాత స్పీడున్నోడు, జాగ్వార్, జై లవ కుశ, సరిలేరు నీకెవ్వరు మూవీల్లో స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గని’ మూవీలోనూ కొడితే స్పెషల్ సాంగ్ లో నటించింది తమన్నా.. మరోవైపు హిందీలోనూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బబ్లీ బౌన్సర్’ మూవీలో లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది.