సురేఖ చెప్పడంతో చెళ్లెళ్లకి రెండేకరాలు రాసిచ్చిన చిరంజీవి.. తన సక్సెస్‌ కారణం ఆమె అంటూ ఎమోషనల్‌

Published : Mar 08, 2022, 06:10 PM IST
సురేఖ చెప్పడంతో చెళ్లెళ్లకి  రెండేకరాలు రాసిచ్చిన చిరంజీవి.. తన సక్సెస్‌ కారణం ఆమె అంటూ ఎమోషనల్‌

సారాంశం

మహిళా దినోత్సవం సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ గురించి ఆసక్తికర విసయాలను వెల్లడించారు. తన సక్సెస్‌ వెనకాల తనే ఉటుందన్నారు. దీంతో సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. 

చిరంజీవి(Chiranjeevi).. శివ శంకర్‌ వర ప్రసాద్‌నుంచి ఇప్పుడు మెగాస్టార్‌గా ఎదిగారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనే ఇండస్ట్రీకి పెద్దగా రాణిస్తున్నారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా రక్తదానం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి తనవంతు ఆర్థిక సాయాన్ని అందిస్తుంటారు. తాజా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో మహిళా దినోత్సవ(Womens Day) వేడుకలు మంగళవారం జరిగాయి. ఇందులో చిరంజీవితోపాటు భార్య సురేఖ, చిరు చెళ్లెళ్లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మహిళా గొప్పతనం చెప్పిన చిరంజీవి.. తన జీవితంలోని మహిళల పాత్రని వెల్లడించారు. ముఖ్యంగా తన భార్య సురేఖ తన సక్సెస్‌లో ఎలా భాగమైందో తెలిపారు చిరు. అల్లు వారి ఇంట్లో తను గారాల పట్టి అని, కానీ తనని పెళ్లి చేసుకున్నాక తమ ఇంట్లో ఆమె పెద్దకోడలు, ఇంట్లో అన్ని బాధ్యతలు తనే చూసుకోవాల్సి వచ్చేదని తెలిపారు. తాను పూర్తిగా సినిమాల్లో బిజీగా ఉండేవాడినని, ఇంటికి సంబంధించిన అన్ని పనులు సురేఖనే చూసుకునేదని పేర్కొన్నారు చిరంజీవి. 

ఈ క్రమంలో ఆమె తన తమ్ముళ్లు, చెళ్ళెళ్ల బాగోగులు కూడా చక్కపెట్టేదని, వారి ఖర్చులు సైతం తనే డీల్‌ చేసేదని తెలిపారు. నాపై ఎలాంటి ప్రభావం పడకుండా అన్ని పనులు తనే చేస్తూ తీరిక లేకుండా గడిపేదని పేర్కొన్నారు చిరంజీవి. తమ్ముళ్లు, చెళ్లెళ్లు, ఫ్యామిలీ చూసుకోవాల్సిన బాధ్యత తనదని, కానీ తను చూసుకోవాల్సిన అవసరం లేకుండా సురేఖ చేసిందని, కష్టమంతా తనే పడిందని పేర్కొన్నారు.  ఇలా అన్నింటికి తనే కారణమని భార్యని సభాముఖంగా చిరంజీవి అభినందించారు. దీంతో సురేఖ ఎమోషనల్‌ అయ్యారు. 

అయితే ఈ సందర్బంగా ఫన్నీ కామెంట్‌ చేశారు చిరంజీవి. ఇంటికెళ్లాక ఎలా ఉంటుందో తెలియదంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. పాజిటివ్‌గా ఉంటుందా?, ఎమోషనల్‌గా ఉంటుందా, అందరి ముందు ఇబ్బందికి గురి చేశారని అంటుందా తెలియదు. గాలికొదిలేశాను అంటూ సెటైర్లు వేసి అందరిని నవ్వించారు చిరు. అంతేకాదు సురేఖ గురించి ఇంకా చెబుతూ తను ఎప్పుడో కోకాపేటలో కొంత భూమిని కొనుగోలు చేశాడట. ఫామ్‌ హౌజ్‌ కట్టుకుని, వ్యవసాయం పనులు చేద్దామనుకుని ఆ రోజు కొనుగోలు చేశారట. కానీ ఇప్పుడదీ స్మార్ట్ సిటీగా డెవలప్‌ అయ్యిందట. వాల్యూ కోట్లల్లో ఉంటుందని చెప్పారు. 

అయితే తన చెళ్లెళ్లను పెళ్లిళ్లు చేసి, ఇళ్లు కట్టించాను, పిల్లలను కూడా సెట్‌ చేశాను. ఇప్పుడు వారికి చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ ఇటీవల తన భూమికి విలువ పెరిగిన తర్వాత కూడా సురేఖ స్పందించి మీ చెళ్లెళ్లకి ఆ భూమిని రాసిస్తే బాగుంటుంది కదా అని సజెస్ట్ చేసింది. ఏ మహిళని తక్కువ చేయాలని కాదు, తనకు ఫ్యామిలీ ఉంది, ఎదిగిన బిడ్డలున్నారు. ఫ్యామిలీ ఉంది. ఏ మహిళ అయినా తన ఫ్యామిలీ కోసమే చూసుకుంటుంది. కానీ అదేమీ ఆలోచించకుండా మా చెళ్లెళ్లకు మళ్లీ ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని చెప్పడం ఆమె గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు చిరంజీవి. తను కూడా చెళ్లెళ్లకి అది ఆసరాగా ఉంటుందని భావించాను, ఇద్దామనుకున్నా, కానీ ఆ విషయాన్ని తాను మర్చిపోయాను.  మళ్లీ గత ఆగస్ట్ 22న రక్షాబంధన్‌ సందర్భంగా తనే గుర్తు చేసి డాక్యుమెంట్లు కూడా ఇప్పించేలా చేసింది. నేను భూమి తాలుకూ డాక్యుమెంట్లు ఇస్తుంటే చెళ్లెళ్లు సైతం షాక్ అయ్యారని చెప్పారు చిరు. 

ఇప్పుడు మహిళలు ఇంటికే పరిమితం కాదని, ఎంతో ఎదుగుతున్నారని చెప్పారు. చంద్రమండలానికి వెళ్లేస్థాయికి ఎదిగారని, ఒలంపిక్స్ లో మెడల్స్ సాధిస్తున్నారని గుర్తు చేశారు. అలా చేయాలంటే ఇంట్లో మన స్త్రీలను ఎంపవర్‌ చేయాలని, మన అమ్మని, భార్య, చెళ్లెళ్లని, కూతుళ్లని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు చిరంజీవి. వారికి శక్తినిచ్చేలా మన భావజాలం ఉండాలని తెలిపారు మెగాస్టార్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..