విధ్వంసానికి ఇది ఆరంభం మాత్రమే.. యూఎస్ లో మ్యాజికల్ ఫిగర్ దాటేసిన 'RRR'

Published : Mar 08, 2022, 05:13 PM ISTUpdated : Mar 08, 2022, 05:14 PM IST
విధ్వంసానికి ఇది ఆరంభం మాత్రమే.. యూఎస్ లో మ్యాజికల్ ఫిగర్ దాటేసిన 'RRR'

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కి ముందే యూఎస్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఊహకందని విధంగా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా అడ్డంకులు దాటుకుని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు ఆర్ఆర్ఆర్ రెడీ అయిపోయింది. ఈ చిత్రం బ్రిటిష్ కాలం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితంలోని అజ్ఞాత కాలాన్ని దర్శకుడు రాజమౌళి కల్పితంగా మార్చి తెరకెక్కిస్తున్నారు. 

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఇది. ఆ మధ్యన విడుదలైన ట్రైలర్ తో సినిమాపై హద్దుల్లేని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం జనవరి 7న విడుదల కావలసింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈనెల 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

యూఎస్ లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కనీవినీ ఎరుగని విధంగా ప్రీ సేల్స్ లో వసూళ్లు నమోదవుతున్నాయి. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ యూఎస్ మ్యాజికల్ ఫిగర్ 1 మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే యూఎస్ వసూళ్లు రిలీజ్ టైంకి మరింత భారీగా ఉండబోతున్నట్లు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఒక్క యూఎస్ లో మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. 

ఆర్ఆర్ఆర్ చిత్రం  బాక్సాఫీస్ వద్ద సృష్టించే విధ్వంసానికి ఇది ప్రారంభం మాత్రమే అని అంచనా వేస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ లాంటి బడా స్టార్లు నటించిన చిత్రం కావడంతో భాషా భేదం లేకుండా ఇండియా మొత్తం ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తోంది. 

డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం అందించగా.. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. 

PREV
click me!

Recommended Stories

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..