SureRest మ్యాట్రెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. పట్టుచీరలో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ!

By Asianet News  |  First Published Feb 21, 2023, 6:12 PM IST

స్టార్ హీరోయిన్ తమన్నా వరుస చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు పలు బ్రాండ్లనూ ప్రమోట్ చేస్తున్నారు తాజాగా SureRest మ్యాట్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. ఈ సందర్బంగా పట్టుచీరలో మెరిసిపోతున్నారు. 
 


స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. చివరిగా మహాశివరాత్రి ఉత్సవాల్లో మెరిసిందీ భామ. అయితే తాజాగా తమన్నా.. ప్రముఖ SureRest మ్యాట్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. 1988 నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్‌లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్‌లలో SureRest ఒకటి.  ఈ సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు, రిటైల్ మార్కెట్ ను విస్తరించడానికి ప్రముఖ తెలుగు నటి తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

SureRest ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్‌లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్‌లలో ఒకటి. ఈ బ్రాండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రసిద్ధి చెందినందున, టాలీవుడ్ నటిగా తమన్నా యొక్క స్టార్ పవర్ బ్రాండ్ ప్రస్తుత మార్కెట్‌లను మించి వినియోగదారులను చేరుకోవడంలో సహాయపడుతుందని భావించారు. 

Latest Videos

ఈ సందర్భంగా నిర్వాహకులు ఉత్తమ్ మలానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంచరీ మ్యాట్రెస్ మాట్లాడుతూ..  ‘తమన్నా SureRest కి వ్యూహాత్మకంగా చక్కగా సరిపోతారు. ప్రస్తుతం, మా ఫోకస్ అంతా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర దక్షిణాది మార్కెట్ల మీద వుంది, మరియు తమన్నాకు ఏపీ, తెలంగాణ అంతటా గొప్ప అభిమానులు ఉన్నారు. ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసే ఐకాన్ ఆమె. SureRest బ్రాండ్ మరింత వృద్ది చెందడానికి, ఈ అసోసియేషన్ సహాయం పడుతుందని మేం ఖచ్చితంగా నమ్ముతున్నామని’ తెలిపారు. 

మరోవైపు తమన్నా కూడా స్పందిస్తూ.. SureRest అనేది ఒక ఇంటి పేరు. నాణ్యత, వినూత్న ఉత్పత్తులు, శ్రేణిలను కచితత్వంగా సూచిస్తుంది. నేను బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించగలిగినందుకు, ప్రజలు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి వారిని ప్రోత్సహించడానికి సంతోషిస్తున్నాను. మంచి నిద్రతోనే మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని’ తెలిపారు. ఇక ప్రస్తుతం తమన్నా మెగా స్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’, తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ సరసన నటిస్తోంది. ఈ సినిమాలపై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. 

click me!