మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా ఎయిర్ పోర్టులో కనిపించారు. వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఆస్కార్స్ 2023’ ఈవెంట్ కు బయల్దేరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'RRR' సినిమాతో తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కింది. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించగా.. ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీం పాత్రల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, పాటలు ఆకట్టుకున్నాయి. రాజమౌళి దర్శక ప్రతిభకూ ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన అవార్డులనూ దక్కించుకుంది.
చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) అవార్డ్స్ ఫంక్షన్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్‌లో మార్చి 12న జరగనున్న అతిపెద్ద ఆస్కార్2023 అవార్డుల ప్రధానోత్సవంలో రామ్ చరణ్ పాల్గొనేందుకు బయల్దేరినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించారు. అయ్యప్ప మాలలో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆస్కార్స్ అవార్డుల రేసులో ‘ఆర్ఆర్ఆర్’ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ షార్ట్ లిస్టై.. నామినేట్ కూడా అయిన విషయం తెలిసిందే. దీంతో తప్పకుండా ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వరిస్తుందని తెలుగు ప్రేక్షకులు బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో మరికొద్దిరోజుల్లో జరగనున్న ఆస్కార్స్ అవార్డుల ప్రధానోత్సవానికి బయల్దేరినట్టు తెలుస్తోంది. అలాగే HCA అవార్డ్స్ 2023 ఈవెంట్ కు కూడా ఆహ్వానం అందడంతో ఆ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి ఈ వేడుక జరగనుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. ప్రతి ఏడాది దీక్ష తీసుకుంటున్న చరణ్ ఈసారి కూడా 48 రోజుల పాటు అయ్యప్ప మాలను తీసుకున్నారు.అయితే ‘ఆస్కార్స్’ అవార్డ్స్ వేదికలో చరణ్ హాజరుకాబోతుండంతో మన హిందూ సంప్రదాయాలను ఆ ప్రపంచానికి తెలియజేసే అవకాశం కూడా ఉందంటున్నారు పలువురు. ఇక చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంతో నటించబోతున్నారు.