తాప్సీ చేసిన దెయ్యం పాత్రలో తమన్నా

Published : Apr 14, 2019, 06:52 PM IST
తాప్సీ చేసిన దెయ్యం పాత్రలో తమన్నా

సారాంశం

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేసేటప్పుడు  అక్కడ ఎవరు ఫామ్ లో ఉన్నారో వారిని తీసుకుని రీమేక్ చేస్తూంటారు.  ఇప్పుడు తమిళంలో తమన్నాకు టైమ్ నడుస్తోంది. దాంతో తెలుగులో హిట్టైన ఆనందో బ్రహ్మ చిత్రం రీమేక్ లో ఆమెను తాప్సీ పాత్రకు గాను తీసుకున్నారని సమాచారం. 

తెలుగులో చిన్న కామెడీ హారర్ చిత్రంగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఆనందోబ్రహ్మ. ఈ చిత్రానికి  దర్శకుడు మహి వీ.రాఘవ్‌. తాప్సీ తో మరి నలుగురు కమిడియన్స్ ని ప్రధాన పాత్రలుగా తీసుకుని ఈ సినిమా ని రూపొందించారు. ఆ సినిమాలో తాప్సీ దెయ్యంగా కనిపించింది. ఇప్పుడు తమన్నా కూడా తమిళంలో దెయ్యంగా కనిపించబోతోందన్నమాట. ఈ చిత్రాన్ని తమిళంలో స్వయంగా అదే దర్శకుడు డైరక్ట్ చేయబోతున్నారు. అందుకు  సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. 

తమన్నా ప్రస్తుతం విశాల్‌తో సుందర్‌.సీ దర్శకత్వంలో చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. ఈ సినిమా తరువాత మరో చిత్రంలోనూ విశాల్‌తో రొమాన్స్‌ చేయడానికి తమన్నా ఓకే చెప్పింది. తెలుగులో మాత్రం కొత్తగా ఏ చిత్రాలు కమిటవ్వలేదు.

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి