ఎన్టీఆర్ కి నో చెప్పి.. బన్నీకి గ్రీన్ సిగ్నల్!

Published : Apr 14, 2019, 05:05 PM IST
ఎన్టీఆర్ కి నో చెప్పి.. బన్నీకి గ్రీన్ సిగ్నల్!

సారాంశం

బాలీవుడ్ లో అప్పుడపుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న టబు సౌత్ లో నటించడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపలేకపోయింది. 

టాలీవుడ్ సీనియర్ నటి టబు తెలుగు తెరపై కనిపించి కొన్నేళ్లవుతోంది. బాలీవుడ్ లో అప్పుడపుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న టబు సౌత్ లో నటించడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపలేకపోయింది. కొన్ని కథలు వచ్చినప్పటికీ టబు పట్టించుకోలేదు. ఇక త్రివిక్రమ్ ఆమెను రెండు సార్లు కలవగా మూడవసారి ఒకే చేసింది. 

మొదట జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా కోసం త్రివిక్రమ్ ఆమెను ఒక పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడు నో చెప్పిన టబు రీసెంట్ గా బన్నీ కథను వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా రెండవసారి బ్రతిమాలితే గాని ఆమె ఒప్పుకోలేదు. మొదట కథను రాస్తున్నప్పుడే త్రివిక్రమ్ ఆమెను సంప్రదించాడు. 

అప్పుడు టబు అసలు పట్టించుకోలేదు. ఇక ఫైనల్ గా కథ సెట్స్ పై కి వెళ్లే సమయానికి మరొకసారి త్రివిక్రమ్ ఆమె తలుపు తట్టగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా టబు ఎన్టీఆర్ సినిమాకి మిస్సయినా బన్నీ సినిమాలో సరికొత్తగా కనిపించడానికి సిద్ధమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది