'ధర్మహ ' సెకండ్ లుక్ లాంచ్ చేసిన మంత్రి తలసాని

pratap reddy   | Asianet News
Published : Aug 19, 2021, 02:21 PM IST
'ధర్మహ ' సెకండ్ లుక్ లాంచ్ చేసిన మంత్రి తలసాని

సారాంశం

ఎల్కోటి విజయ్ కుమార్ దర్శకత్వంలో స్లమ్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతున్న చిత్రం ధర్మహ. బాల నటులతో దర్శకుడు ఎల్కోటి తెరకెక్కిస్తున్న సందేశాత్మక చిత్రం ఇది.

ఎల్కోటి విజయ్ కుమార్ దర్శకత్వంలో స్లమ్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతున్న చిత్రం ధర్మహ. వైపిబిఆర్ ఆర్ట్స్ మరియు శ్రీ పరిగెల సద్గురు రాణి ప్రెజెంట్స్ బ్యానర్స్ లో ప్రశాంత్ కుమార్ పరిగెల,చిప్పగిరి సతీష్ కుమార్ , శ్రీధర్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాల నటులతో దర్శకుడు ఎల్కోటి తెరకెక్కిస్తున్న సందేశాత్మక చిత్రం ఇది. ఇదిలా ఉండగా నేడు చిత్ర యూనిట్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు. మంత్రి తలసాని తన చేతుల మీదుగా ఈ చిత్ర సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫి మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. యువ దర్శకుడు యల్కోటి విజయ్ కుమార్ తీసుకున్న పాయింట్ చాలా బావుంది. మంచి సందేశాత్మక చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఈ చిత్రం తో సొసైటికి  మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు. షూటింగ్ జరిగిన భాగాన్ని ఎల్కోటి విజయ్ కుమార్ నాకు చూపించాడు. అతడు పడ్డ కష్టం నాకు కనిపించింది. 

ఇలాంటి యువ దర్శకులకు నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. తమ చిత్ర పోస్టర్ లాంచ్ చేసేందుకు తలసానిగారు అడగ్గానే అంగీకరించారు అని నిర్మాతలు అన్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ చిత్రం మాకు, దర్శకుడికి మంచిపేరు తీసుకువస్తుంది అని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని ప్రొడ్యూసర్స్ తెలిపారు. 

మాస్టర్ ప్రీతమ్ యువరాజ్, మాస్టర్ ఇషాన్, తుల్య, ప్రమీల రాణి,ఆకాశవాణి  ప్రభు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్